Movie News

హడావిడిలో నలిగిపోతున్న క్లాసిక్ సినిమా

బాలకృష్ణ అత్యుత్తమ సినిమాల్లో భైరవ ద్వీపంది ప్రత్యేక స్థానం. గ్రాఫిక్స్ టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఈ జానపదాన్ని ఆవిష్కరించిన తీరు అప్పట్లో బ్లాక్ బస్టర్ సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. అందుకే రీ రిలీజ్ అనగానే ప్రత్యేకమైన ఎగ్జైట్ మెంట్ అభిమానులకు కలగడం సహజం. అయితే ఎల్లుండి విడుదల కాబోతున్న ఈ ఆల్ టైం క్లాసిక్ కి సరైన థియేటర్లు దొరక్క, షోలు సర్దుబాటు కాక హడావిడి పడుతోంది. చాలా చోట్ల అసలిది వస్తోందన్న సంగతే గుర్తు లేనంత వీక్ గా ప్రమోషన్లు చేపట్టడం విచారకరం.

కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఉంటే బాలయ్య సైతం వీడియో బైట్స్ ఇవ్వడం, సినిమా చూడమని ప్రోత్సహించడం చేసేవాళ్ళు. కానీ డిస్ట్రిబ్యూటర్ కు ఆ ధ్యాస కానీ, ఆలోచన కానీ లేదు. కేవలం రెండు రోజుల ముందు ప్రకటన ఇవ్వడం వల్ల జనానికి ఇది రీచ్ కావడం లేదు. పైగా విజయ్ దేవరకొండ ఖుషి ముంగిట్లో ఉండగా భైరవ ద్వీపంని నెలాఖరులో తీసుకురావడం కూడా సరైన స్ట్రాటజీ కాదు. మంత్ ఎండింగ్ లో జనాలు థియేటర్లకు వెళ్లి ఖర్చు పెట్టుకుని సినిమాలు చూసే మూడ్ లో ఉండరు. ఇవన్నీ విశ్లేషించుకుని కనీసం మూడు నాలుగు వారాల ముందు ప్లానింగ్ చేసుకోవాలి.

ఇదే తరహాలో ఆ మధ్య నరసింహనాయుడుని కిల్ చేశారు. గొప్పగా రీ మాస్టర్ చేయించినా సరైన ప్లానింగ్ లేక అంత శ్రమపడిన టెక్నికల్ టీమ్ కు తగిన ఫలితం దక్కలేదు. భైరవద్వీపంలో నటించిన ఎందరో ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఉన్నారు. రోజా, విజయ్ కుమార్, బాబు మోహన్, గిరిబాబు, శుభలేఖ సుధాకర్, రంభ చాలా మందిని కలిసే అవకాశం ఉంది. సింగీతం వారు సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ఇంత అవకాశం ఉండి ఇప్పటి తరానికి గొప్పగా పరిచయం చేయాల్సిన ఒక క్లాసిక్ మూవీని 4కెకి మార్చిన ప్రయోజనం పూర్తిగా దక్కనివ్వకుండా చేస్తున్నారు. 

This post was last modified on August 28, 2023 10:46 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

7 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

8 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

8 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

9 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

9 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

9 hours ago