సినిమా ఓపెనింగ్ తో , లేదా ఎనౌన్స్ మెంట్ వీడియోతో షూట్ కి ముందే సినిమాపై హైప్ తీసుకురావడం సహజమే. కానీ యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ తో చేయబోయే నెక్స్ట్ సినిమాకి కొత్త రకంగా హైప్ క్రియేట్ చేశాడు. ప్రతీ సినిమాకు ఓ ఆఫీస్ ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ నుండే ఆ ఆఫీస్ లో వర్క్ మొదలవుతుంది. అయితే ఎంత పెద్ద సినిమా అయినా సైలెంట్ గా ఆఫీస్ తీసుకొని పనులు మొదలు పెడతారు. కానీ తాజాగా రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ఆఫీస్ ఓపెనింగ్ తోనే ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చి హైప్ క్రియేట్ చేశారు.
జూబ్లీహిల్స్ లో ఈ సినిమా ఆఫీస్ కోసం ఓ బిల్డింగ్ మొత్తం రెంట్ కి తీసుకున్నారు. అందులో పూజా కార్యక్రమాలు , హోమాలు నిర్వహించారు. బుచ్చి బాబు, నిర్మాతలు పట్టు వస్త్రాలతో పంచే కట్టుతో కనిపించారు. సుకుమార్ కూడా అదే గెటప్ లో కనిపించడం విశేషం. దీంతో ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ ఫ్యాన్స్ ఆఫీస్ ఓపెనింగే ఇలా ఉంటే సినిమా ఓపెనింగ్ అలాగే ఈవెంట్స్ ఎలా ఉంటాయో అని ఇప్పటి నుండే భారీగా ఊహించుకోవడం మొదలెట్టారు.
ఏదేమైనా ఆఫీస్ ఓపెనింగ్ తోనే దర్శకుడు బుచ్చి బాబు సినిమాపై మంచి హైప్ తెచ్చాడు. ఓపెనింగ్ కూడా లేకుండా ఇలా సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆఫీస్ ఓపెనింగ్ కి ఈ రేంజ్ పూజలు , హోమాలు చేయడం ఇదే మొదటి సారేమో అంటూ ఫోటోస్ చూసి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. డిసెంబర్ లేదా జనవరి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ శంకర్ తో గేమ్ చేంజర్ పూర్తి చేసి బుచ్చి బాబు సినిమాను మొదలు పెడతాడు. ఈ లోపు బుచ్చిబాబు రెహ్మాన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్, లోకేషన్స్ స్కౌటింగ్ చూసుకుంటాడు.
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……