ఎన్ని వందల కోట్లతో సినిమా తీసినా, ఎంత మంచి కంటెంట్ పెట్టినా ఈ రోజుల్లో హైప్ లేనిదే పెద్ద స్టార్ హీరో అయినా సరే ఓపెనింగ్స్ రావడం కష్టం. అందుకే ఈ విషయంలో నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేవలం పబ్లిసిటీకే కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళను అన్ని భాషల్లోనూ చూడొచ్చు. కానీ ఉపేంద్ర మాత్రం నా రూటే వేరు అంటున్నారు. ఈయన స్వీయ దర్శకత్వంలో నామం సింబల్ తో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఏం అనాలో అర్థం కాక UI అని వ్యహరిస్తున్నారు. ఏడాదికి పైగా ఇది షూటింగ్ లోనే ఉంది. ఇప్పుడు చివరి దశకు వచ్చింది.
ఈ UIని ప్యాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే అభిమానులు ఎంత డిమాండ్ చేస్తున్నా ఇప్పటిదాకా ఒక టీజర్ కూడా రిలీజ్ చేయలేదు ఉపేంద్ర. నిర్మాతలు ఏదో ఒకటి చేస్తే హైప్ వస్తుందని అడిగితే అదేమీ అక్కర్లేదని అంటున్నారు. అబద్దాలు అమ్ముకోవడానికి మార్కెటింగ్ కావాలి కానీ నిజాలకు అవసరం లేదని, అంతగా కావాలనిపిస్తే విడుదల తేదీ ప్రకటించుకోమని తేల్చి చెప్పేశారు. దీంతో అవాక్కయిన ప్రొడ్యూసర్లు చేసేదేమి లేక సరేనన్నారు. ఈ మొత్తం వీడియో కన్నడ బాషలో రూపొంది యూట్యూబ్ లో ఆల్రెడీ తిరిగేస్తోంది.
A, ఓం నుంచే దర్శకుడిగా తన విలక్షణ శైలిని బయట పెడుతూ వచ్చిన ఉపేంద్ర ఈ UI అన్నింటి కన్నా చాలా టఫ్ గా ఉంటుందని అంటున్నారు. ఆ మధ్య కబ్జా ప్రెస్ మీట్ లో ఓ తెలుగు ఫ్యాన్ ఏదైనా చెప్పమని అడిగితే, తన కొత్త సినిమాని అర్థం చేసుకుంటే చాలు మీలో గొప్ప జ్ఞాని ఉన్నాడని అర్థం చేసుకోవచ్చని చెప్పి షాక్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ కాంటెంపరరీ సబ్జెక్టుతో రూపొందుతున్న UIలో ఇతర క్యాస్టింగ్ గురించి ఎలాంటి లీక్స్ బయటికి రాకుండా ఉపేంద్ర అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెజిఎఫ్, కాంతార రేంజ్ లో దీనికి అంచనాలు ఉంటాయని శాండల్ వుడ్ విశ్లేషకులు ఆశిస్తున్నారు.
This post was last modified on August 28, 2023 6:38 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…