Movie News

ధృవ 2 స్క్రిప్ట్ సిద్ధం చేసిన దర్శకుడు

రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఫీలయ్యే సినిమా ధృవ. తమిళ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ రీమేక్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అప్పట్లో మంచి విజయం నమోదు చేసుకుంది. డిసెంబర్ సెంటిమెంట్ కి ఎదురీది మరీ హిట్టు కొట్టింది. ఇది జరిగి ఎనిమిదేళ్లు దాటేసింది. ఒరిజినల్ వెర్షన్ జయం రవి హీరోగా 2015లో వచ్చింది. ధృవ 2కి కొనసాగింపు కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే అసలు సృష్టికర్త మోహన్ రాజా దీని సీక్వెల్ కోసం చేసిన కసరత్తు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చి ఇవాళ అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు.

ఇక్కడే ఉంది అసలు మతలబు. అనౌన్స్ మెంట్ వస్తోంది తమిళ కొనసాగింపు గురించి. ఈ రోజు చెన్నైలోని ఏజిఎస్ థియేటర్ లో తని ఒరువన్ స్పెషల్ స్క్రీనింగ్ వేస్తున్నారు . అందులోనే 2కి సంబంధించిన వీడియో టీజర్ ని లాంచ్ చేయబోతున్నారు. దర్శకుడిగా మోహన్ రాజానే వ్యవహరిస్తారు. అక్కడ తీస్తున్నారంటే సహజంగా ఇక్కడ రామ్ చరణ్ తోనూ చర్చలు జరిగే ఉంటాయి. చిరంజీవితో గాడ్ ఫాదర్ చేస్తున్న టైంలో మోహన్ రాజా మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్ అయ్యారు. ఆ సందర్భంగానే తనకు చరణ్ కు మధ్య ధృవ 2కి సంబంధించిన చర్చలు జరిగాయి.

కథ పూర్తికాగానే చెప్తానని అన్నారట. సో ఇప్పుడు కన్ఫర్మ్ గా సిద్ధమయ్యింది కాబట్టి శంకర్, బుచ్చిబాబుల సినిమాల తర్వాత రామ్ చరణ్ ధృవ 2 చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఛాన్స్ సూరికి కాకుండా నేరుగా మోహన్ రాజాకే ఇవ్వొచ్చు. షూటింగ్ వివరాలు, విడుదల ఎప్పుడు ఉండొచ్చు లాంటి వివరాలేమీ ఇంకా తెలియలేదు. ఫస్ట్ టీమ్ నే దాదాపు కొనసాగించబోతున్నారు. పొన్నియిన్ సెల్వన్ తర్వాత జయం రవి మార్కెట్ పెరగడంతో తని ఒరువన్ 2కి అది కూడా ప్లస్ కానుంది. ధృవ 2 నిజంగా డిసైడ్ అయితే మాత్రం లేట్ చేయకుండా వీలైనంత త్వరగా కమిటవ్వడం బెటర్. సమాంతరంగా చేస్తే ఇంకా మంచిది.

This post was last modified on August 28, 2023 2:44 pm

Share

Recent Posts

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

51 minutes ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

60 minutes ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

1 hour ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

4 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

4 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

4 hours ago