అదేంటి కలిసి నటించని వీళ్లిద్దరికీ లింక్ ఏంటనుకుంటున్నారా. అక్కడే ఉంది మతలబు. శ్రీలీల ఇండస్ట్రీకి రాక ముందు నుంచే యష్ భార్య రాధికా పండిట్ కుటుంబంతో స్నేహం ఉంది. వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్లని కూడా కొందరు పొరపడుతూ ఉంటారు. రాధికా రెండు డెలివరీలు శ్రీలీల తల్లే చేయడం వల్ల వీళ్ళ ఫ్రెండ్ షిప్ బలపడింది. కెజిఎఫ్ కెమెరామెన్ భువన గౌడ శ్రీలీల ఫ్యామిలీకి స్నేహితుడు కావడంతో ఆమె పది తరగతి వయసులో ఒక ఫోటో షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవకాశాలు మొదలయ్యాయి. కిస్ రూపంలో ఫస్ట్ ఆఫర్ తలుపు తట్టింది.
యష్, రాధికా ఇద్దరూ శ్రీలీలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలా ఈ బాండింగ్ బలపడింది. రాఖీ భాయ్ ని జీజూ అని పిలవడం టాలీవుడ్ టాప్ చైర్ కు పోటీ పడుతున్న ఫ్యూచర్ డాక్టర్ అలవాటు. నిజానికి హలో గురు ప్రేమ కోసమే సినిమాకే శ్రీలీలని దర్శకుడు త్రినాథరావు నక్కిన అడిగారు. కానీ అప్పుడు కుదరలేదు. కట్ చేస్తే అదే డైరెక్టర్ తో ధమాకా పెద్ద బ్రేక్ గా నిలిచింది. ఆ తర్వాత రామ్ తో మిస్ చేసుకున్న ఛాన్స్ స్కంద రూపంలో నెరవేరింది. లింకులన్నీ కలిసి వచ్చినట్టు ఇలా ఇండస్ట్రీకి రావడానికి శ్రీలీల వెనుక ఎన్నో అడుగులు ఉన్నాయి.
ఈ ముచ్చట్లన్నీ ఓ పత్రికతో పంచుకున్న శ్రీలీల ప్రస్తుతం కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తోంది. స్కందతో పాటు భగవంత్ కేసరి, ఆదికేశవ అన్నీ తక్కువ గ్యాప్ లో రిలీజ్ కాబోతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం మీద ఎలాంటి అంచనాలున్నాయో తెలిసిందే. డిసెంబర్ లో నితిన్ తో జోడికట్టిన ఎక్స్ ట్రాడినరి మెన్ రిలీజ్ కానుంది. త్వరలో ఎంబిబిఎస్ పరీక్షల కోసం షూటింగుల కోసం బ్రేక్ తీసుకోబోతున్న శ్రీలీలతో చివరి స్టేజిలో బ్యాలన్స్ ఉన్న దర్శకులందరూ ఫాస్ట్ ప్లానింగ్ లో ఉన్నారు. ఇవి కాకుండా అమ్మడి చేతిలో ఇంకో అరడజను ప్రాజెక్టులున్నాయి.
This post was last modified on August 27, 2023 5:13 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…