గొప్ప చరిత్ర ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో ఎవ్వరికీ సాధ్యం కాని ఘనతను అల్లు అర్జున్ అందుకున్నాడు. ‘పుష్ప’ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును దక్కించుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది గొప్ప నటులున్నా.. వారి మీద ఇంత కాలం జాతీయ అవార్డుల జ్యూరీ శీతకన్నేసింది. మనకు ఎన్నోసార్లు అన్యాయం జరిగిన మాట వాస్తవం. కానీ గతం గత: అనుకుని.. ఇప్పటికైనా మన ఇండస్ట్రీ నుంచి ఒక నటుడికి జాతీయ పురస్కారం దక్కినందుకు సంతోషించాలి.
బన్నీతో పాటు అతడి అభిమానులే కాక సినీ జనాలంతా బన్నీకి దక్కిన ఈ గౌరవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బన్నీని అందరూ కొనియాడుతున్నారు. ఐతే అల్లు వారి అబ్బాయికి ఈ పురస్కారం దక్కడంలో సగం క్రెడిట్ కచ్చితంగా దర్శకుడు సుకుమార్‌కు ఇవ్వాల్సిందే. ఈ విషయాన్ని బన్నీ సైతం అంగీకరిస్తాడు అనడంలో సందేహం లేదు.
తొలి చిత్రం ‘గంగోత్రి’ బాగానే ఆడినప్పటికీ.. అందులో లుక్స్, నటన విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్న అల్లు అర్జున్‌ను ‘ఆర్య’తో సరికొత్తగా ప్రెజెంట్ చేసి అతడి కెరీర్‌ను మార్చిన ఘనత సుకుమార్‌దే. బన్నీకి జనాల్లో యాక్సెప్టెన్స్ తీసుకొచ్చింది సుక్కునే అనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని బన్నీ కూడా చాలాసార్లు చెప్పుకున్నాడు. వీరి కలయికలో వచ్చిన రెండో చిత్రం ‘ఆర్య-2’ అనుకున్నంత ఆడకపోయినా.. నటుడిగా ఈ సినిమాతో ఇంకొన్ని మెట్లు ఎక్కడమే కాక యూత్‌లో ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇక సుక్కు దర్శకత్వంలో చేసిన మూడో చిత్రం ‘పుష్ప’ రేపిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే.
పుష్ప పాత్రను డిజైన్ చేసిన తీరు.. దాని కోసం బన్నీకి చేయించిన మేకోవర్.. అతడి నుంచి రాబట్టుకున్న నటన.. అన్నింట్లోనూ సుక్కు ముద్ర స్పష్టం. బన్నీ అనే శిల్పం అందరికీ గొప్పగా కనిపించిందంటే.. అతడి వెనుక ఉన్న శిల్పి సుకుమార్. తనతో పని చేసిన ప్రతి హీరో నుంచీ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ రాబట్టుకున్న ఘనత ఉన్న సుక్కు.. ‘పుష్ప’లో బన్నీ నుంచి మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ ఇప్పించి అతడికి ఏకంగా నేషనల్ అవార్డు వచ్చేలా చేశాడు. కాబట్టి ఈ అవార్డులో సగం క్రెడిట్ ఆయనదే.
This post was last modified on August 27, 2023 4:06 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…