ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ చాలా ఫేమస్ అయిపోయాడు యువ కథానాయకుడు కార్తికేయ. ఆ గుర్తింపుతోనే చాలా సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడతను. కానీ ఈ సినిమాల్లో ఏదీ అతడికి ఆశించిన విజయాన్నందించలేదు. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో చేసిన చావు కబురు చల్లగా సైతం నిరాశ పరిచింది. విలన్ పాత్రలు చేసిన గ్యాంగ్ లీడర్, వలిమై సైతం అనుకున్నంతగా ఆడలేదు.
హీరోగా మార్కెట్ అంతకంతకూ పడిపోతున్న సమయంలో అతను బెదురులంక 2012తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి ఈ సినిమాకు కూడా ఆశించినంత బజ్ లేదు. బిజినెస్ జరగక రిలీజ్ కూడా బాగా ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఆగస్టు 25కు రిలీజ్ ఫిక్స్ చేశారు. కానీ గాండీవధారి అర్జున, కింగ్ ఆఫ్ కోతా, బాయ్స్ హాస్టల్ లాంటి సినిమాల పోటీని తట్టుకుని ఈ చిత్రం ఏమాత్రం నిలబడుతుందో అన్న సందేహాలు కలిగాయి.
కానీ కార్తికేయ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర బాగానే కలిసి వస్తోంది. దుల్కర్ సల్మాన్ సినిమా కింగ్ ఆఫ్ కోతా బ్యాడ్ టాక్‌తో తొలి రోజే వాషౌట్ అయిపోయింది. వరుణ్ తేజ్ మూవీ గాండీవధారి అర్జున పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఇవి రెండూ వీకెండ్లోనే నిలబడలేకపోయాయి. ఇక కన్నడ అనువాద చిత్రం బాయ్స్ హాస్టల్ టాక్ కూడా ఏమంత గొప్పగా లేదు.
ఇది లిమిటెడ్ ఆడియన్స్‌ను మాత్రమే ఆకర్షించేలా ఉంది. ఐతే టాక్ చూస్తే బెదురులంకకు గొప్పగా ఏమీ రాలేదు. కానీ పోటీలో ఉన్న మిగతా చిత్రాలతో పోలిస్తే ఇదే బెటర్. సెకండాఫ్‌లో కామెడీ బాగానే వర్కవుట్ అయింది. అది టికెట్ డబ్బులకు ఓ మోస్తరుగా న్యాయం చేసేదే. అందుకే ఈ వారానికి ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ బెదురులంకనే అవుతోంది. టాక్ గొప్పగా లేకపోయినా ఆక్యుపెన్సీలు బాగానే ఉన్నాయి. సినిమా ఓ మోస్తరు విజయంతో బయటపడేలా కనిపిస్తోంది.
This post was last modified on August 27, 2023 1:39 am
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…