పుష్ప సినిమా రిలీజైనపుడు వచ్చిన టాక్ చూసి చిత్ర బృందం కంగారు పడే ఉంటుంది. సుకుమార్ చివరి సినిమా రంగస్థలంతో పోల్చి చూసుకుని ఈ సినిమా పట్ల పెదవి విరిచారు చాలామంది. రివ్యూలు, రేటింగ్స్ అన్నీ యావరేజ్ అన్నట్లే ఉన్నాయి. టాక్ కూడా డివైడ్‌గానే వచ్చింది. దీంతో రిజల్ట్ తేడా కొడుతుందేమో అన్న భయాలు కలిగాయి. కానీ ఆ టాక్‌ను తట్టుకుని సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే రాబట్టింది. ఐతే కరోనా ప్రభావం, ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉండటం వల్ల అంతిమంగా సంతృప్తికర ఫలితం మాత్రం రాలేదు.
కానీ పుష్ప ఇతర భాషల్లో అంచనాలను మించి ఆడేసింది. ముఖ్యంగా హిందీలో ఆ సినిమా పెద్ద బ్లాక్‌బస్టరే అయింది. రిలీజ్ తర్వాత ఒక యుఫోరియా సృష్టించింది. అది పుష్ప-2కు బాగా కలిసొచ్చింది. పుష్ప పాటలు.. హీరో డైలాగులు, మేనరిజమ్స్ అన్నీ కూడా జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి. దీంతో సినిమా షూట్ మొదలు కావడానికి ముందే హైప్ వచ్చేసింది.. ఆ హైప్ ఇప్పుడు ఇంకా పెరిగిపోయి పుష్ప-2 విడుదలకు ముందే ప్రకంపనలు రేపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జాతీయ అవార్డుల్లో పుష్ప సినిమాకు రెండు పురస్కారాలు దక్కిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా.. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ అవార్డు గెలిచాడు. దీంతో పుష్ప గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా మీద అంచనాలను ఇది మరింత పెంచే పరిణామమే అనడంలో సందేహం లేదు. అదే సమయంలో అంచనాల ఒత్తడి చిత్ర బృందానికి ఇబ్బందికరం కూడా. అసలే సుకుమార్ సినిమాను మామూలుగా చెక్కట్లేదని అంటున్నారు. ఇప్పుడు అంచనాలు ఇంకా పెరిగిపోవడంతో ఆయన పర్ఫెక్షన్ ఇంకా పెరిగిపోతుందేమో. రిలీజ్ కూడా ఆలస్యమైనా ఆశ్చర్యం లేదు.
This post was last modified on August 26, 2023 5:43 pm
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ క్యాన్సర్ తో పోరాడుతూ ‘దేవర’ సినిమా చూడాలని ఉందని కోరిన వీడియో గతంలో వైరల్…
కరోనా దెబ్బకు ఆల్రెడీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఏవైనా పెద్ద, ఈవెంట్ సినిమాలు రిలీజైనపుడే థియేటర్లు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి…
ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక…
తండేల్ విడుదలకు ఇంకో నలభై మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే కొంత ఆలస్యం తర్వాత పలు డేట్లు మార్చుకుంటూ…