ఒకప్పుడు జాతీయ అవార్డులు ప్రకటిస్తే.. ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో అయితే తెలుగు సినిమాకు చోటు దక్కుతుందా అని చూసేవాళ్లం. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం లాంటి విభాగాల్లో తెలుగు సినిమాలకు అవకాశం ఉంటుందని అసలు అంచనాలే పెట్టుకునేవాళ్లు కాదు. అలాంటిది ఈ రోజు ఏకంగా 11 విభాగాల్లో మనకు జాతీయ పురస్కారాలు దక్కాయి. అందులో ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ నేపథ్య సంగీతం.. సహా పలు ప్రతిష్టాత్మక విభాగాల్లో అవార్డులు గెలిచి ఔరా అనిపించింది.
ఒక్క ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మాత్రమే ఆరు అవార్డులను గెలుచుకోవడం విశేషం. ఇది మన వాళ్లకు అమితానందాన్నిచ్చే విషయం. ఐతే అదే సమయంలో ఒకప్పుడు జాతీయ అవార్డుల్లో ఆధిపత్యాన్ని చాటిన వేరే ఇండస్ట్రీల వాళ్లకు ఈ పరిణామం అస్సలు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా తమిళ జనాలకు తెలుగు సినిమాల హవా రుచించడం లేదన్నది వాస్తవం.
ఒకప్పుడు తమిళ సినిమాలకు జాతీయ పురస్కారాల్లో మంచి ప్రాధాన్యం ఉండేది. అక్కడి సినిమాల క్వాలిటీ కూడా అందుకు తగ్గట్లే ఉండేది. అప్పుడు మనవి రొడ్డ కొట్టుడు సినిమాలంటూ ఎగతాళి చేసేవాళ్లు. కానీ ఇప్పుడు తెలుగు సినిమాల్లో క్వాలిటీ పెరిగింది. కమర్షియల్‌గా భారీ విజయాలు సాధిస్తూనే కంటెంట్‌తోనూ మెప్పిస్తున్నాయి. ఇప్పుడు తమిళ చిత్రాల రేంజ్ అంతకంతకూ పడిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల్లో ఎక్కడలేని ప్రాధాన్యం దక్కడం.. తమిళ చిత్రాల ఊసే లేకపోవడం వారికి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది.
నిజానికి ఈసారి తమిళం నుంచి జై భీమ్, కర్ణన్, సార్పట్ట లాంటి మంచి చిత్రాలే పోటీలో నిలిచాయి. కానీ వీటికి అవార్డులు దక్కలేదు. అందుకే తెలుగు సినిమాల్లో అంత విషయం లేకున్నా అవార్డులు ఇస్తున్నారని.. మన వాళ్లు లాబీయింగ్ చేసి అవార్డులు సాధించుకున్నారని.. కంటెంట్‌ను బట్టి కాకుండా సక్సెస్‌ను బట్టి అవార్డులు ఇచ్చారని.. ఇలా రకరకాలుగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు తమిళ నెటిజన్లు.
This post was last modified on August 26, 2023 11:07 am
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…