ఓటిటిల కోసం ఒరిజినల్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయడంలో తెలుగు నిర్మాతలు, దర్శకులు విఫలమవుతున్నారు. ఓటిటి కోసం తక్కువ బడ్జెట్‍లో, లిమిటెడ్ యూనిట్‍తో వెబ్ సినిమాలు తీయవచ్చునని ప్రయోగాత్మకంగా ‘మెట్రో కథలు’ తీసారు. ముప్పయ్ లక్షల వ్యయంతో ఆహా కోసం ఈ చిత్రాన్ని ఎక్స్పెరిమెంటల్‍గా చేసారు. పలాస దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో షార్ట్ స్టోరీస్‍తో చేసిన ఈ ప్రయోగం దారుణంగా వికటించింది. సినిమా బాగోకపోవడం ఒకటయితే అసలు ఎందుకు తీసారో కూడా అర్థం కాకుండా తయారవడంతో ఆహా విమర్శల పాలవుతోంది.
మంచి కంటెంట్ ప్రొడ్యూస్ చేయడంలో ఆహా మళ్లీ మళ్లీ ఫెయిలవుతూ వుండడం ఓటిటిని తేలికగా తీసుకోరాదనే పాఠం నేర్పించింది. బడ్జెట్ ఎంత వున్నా కానీ కంటెంట్ పరంగా క్వాలిటీ మెయింటైన్ చేయక తప్పదు. ఇలాంటి మెట్రో కథల లాంటివి మరో రెండు వచ్చాయంటే ఆహా నుంచి కొత్త సినిమా వస్తుందన్నా కానీ ప్రేక్షకులు పట్టించుకోరు.
గిరాకీ లేని రాంగోపాల్‍వర్మ వెబ్ సినిమాల మాదిరిగా ఎటూ కాకుండా మిగిలిపోవాల్సి వస్తుంది. లాక్ డౌన్‍లో పెద్ద సినిమాల హక్కులు సాధించడానికి చొరవ చూపించకపోవడం వల్ల ఆహా మరోసారి అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జీ5 తదితర ఓటిటి జయంట్స్ ముందు వెలవెలబోతోంది.
This post was last modified on August 22, 2020 3:01 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…