Movie News

చంద్రబోస్‌.. శెహబాష్‌

తెలుగు సినిమా పాటకు మరోమారు పట్టాభిషేకం జరగనుంది. తాజాగా జాతీయ సినిమా అవార్డుకు ఎంపికై తెలుగు పాట సత్తా చాటింది. ఆ ఘనత సాధించి పెట్టినది చంద్రబోస్‌..! తెలుగు సినిమా పాటకు నేడు ఆయనే బాస్‌..! మొన్న విశ్వవేదిక పై నాటు… నాటు అంటూ తెలుగు పదాలను అందరి పెదాలపై నాట్యమాడిరచారాయన. నేడు అడవిని మించిన బడి లేదంటూ వన దేవతను అందంగా వర్ణించాడు..
పచ్చ పచ్చని చెట్టు చేమ
పట్టు చీరలంటా..
నల్ల నల్ల ముళ్ల కంప
నల్లపూసలంటా.. అంటూ
కొండపొలం చిత్రానికి ఆయన రాసిన పాట నేడు ఉత్తమ గీతంగా ఎంపికైంది.

చిన్న చిన్న పదాలు.. ఆ పదాలలో మట్టి వాసనలు పరిమళింపజేయడం చంద్రబోస్‌ సొంతం. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి ఆయన రాసిన పాట నాటు.. నాటు ప్రపంచ స్థాయిలో అత్యున్నత సినిమా పురస్కారంగా భావించే ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. కిర్రుసెప్పు, కర్రసాము, మర్రిసెట్టు, కుర్రగుంపు, ఎర్రజొన్న, మిరపతొక్కు.. ఇలాంటి జనపదాలను ఏర్చి, పాటగా కూర్చి.. అద్భుత సాహిత్యాన్ని అందించారు చంద్రబోస్‌. ఈ పాట చరణంలో చెప్పినట్లుగానే.. ఒల్లు సెమట పట్టేలా.. ప్రతి ఒక్కరినీ వీరంగం చేయించింది.

మరోసారి చంద్రబోస్‌ తన కలాన్ని రaళింపించారు. క్రిష్‌ దర్శకత్వం వహించిన కొండపొలం చిత్రానికి ఓ అద్భుత గేయాన్ని రాసి అందరినీ మెప్పించడడే కాకుండా జాతీయ అవార్డు కైవశం చేసుకున్నారు. ఈ గీతం కూడా ఆయన కలానికి ఎంత పదునుందో నిరూపించింది. ఈ పాటలో అడవి ఒడిలో బతుకు పాఠాన్ని చెప్పడం చంద్రబోస్‌కే సాధ్యమైంది. గలగల పారే సెలలో నీళ్లు సనుబాలంటూ అద్భుత అభివర్ణణ చేస్తూనే.. సుక్క సుక్క దాచాలంటూ తేనెటీగ తెలిపెనంటా.. మెరుగైన జీవన విధానాన్ని సూత్రీకరించారు. తిన్న ఇంటిని ధ్వంసం చేసే పాపానికి ఒడికట్టొద్దు.. అంటూ వనాలను కాపాడుకోవాలనే సందేశాన్ని కూడా అందించారు. పెద్ద పులితో తలపడే ధైర్యం అడవి పందే నేర్పెనంటా.. కలసి ఉంటే బలముందంటూ రేసు కుక్కలు సాటెనంటా.. ఈ వాక్యాలు ఏ స్ఫూర్తి పాఠాలలో దొరుకుతాయి.. ఒక్క చంద్రబోస్‌ పాటలో తప్ప…! అందుకే.. అంతా అంటున్నారు.. చంద్రబోస్‌.. శెహబాష్‌ అని..!

తెలుగు సినిమా పాటకు జాతీయ అవార్డు దక్కడం ఇది నాలుగోసారి. తొలిసారిగా 1974లో తెలుగు వీర లేవరా అనే గీతానికి గాను శ్రీరంగం శ్రీనివాసరావు ఉత్తమ గేయ రచయిత అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 1993లో రాలిపోయే పువ్వా అనే ఆర్ధ్రత నిండిన గీతాన్ని రాసి వేటూరి సుందరరామమూర్తి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2003లో నేను సైతం అనే గీతానికి గాను సుద్దాల అశోక్‌ తేజ జాతీయ ఉత్తమ గేయ రచయిత పురస్కారానికి ఎంపికయ్యారు. మూడు దశాబ్డాల తర్వాత తెలుగు పాటకు మరోమారు జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. అది చంద్ర బోస్‌ రాసిన ధం.. ధం.. ధం.. అంటూ అడవిని వర్ణించే పాటతో సాధ్యమైంది.

  • అనిల్‌

This post was last modified on August 25, 2023 12:27 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

రౌడీ హీరోతో సుకుమార్ సినిమా – ఛాన్స్ ఉందా

వరస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్…

6 hours ago

అనుమానపడుతూనే అనిరుధ్ మీద పొగడ్తలు

నిన్న సాయంత్రం విడుదలైన దేవర పార్ట్ 1 మొదటి ఆడియో సింగల్ ఫియర్ కు ఊహించని స్థాయిలో ఇటు ఛార్ట్…

8 hours ago

ఒంగోలులో ‘టచ్ చేసి చూడు’ అంటున్న పోలీసులు !

రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ…

9 hours ago

కల్కిలో కమల్ హాసన్ షాకింగ్ నిడివి

ఇంకో ముప్పై ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి ఏడి 2898 కోసం అభిమానులే కాదు యావత్ ఇండస్ట్రీ మొత్తం…

9 hours ago

నోరు జారానా? ముద్ర‌గ‌డ అంత‌ర్మ‌థ‌నం..!

కాలు జారితే తీసుకోవ‌చ్చు. కానీ, నోరు జారితే మాత్రం తీసుకోవ‌డం క‌ష్టం. పైగా ఇది ప‌రువు, ప్ర‌తిష్ట‌ల‌కు కూడా సంబంధించిన…

10 hours ago

పోలింగ్ ఎఫెక్ట్‌: 100 మంది అరెస్టు.. 300 మందిపై ఎఫ్ ఐఆర్‌లు

ఏపీలో ఈ నెల 13న జ‌రిగిన పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస‌..…

11 hours ago