Movie News

గ్యాంగ్ స్టర్ పాత్రలకు అవార్డులివ్వరా – వాటే జోక్

నిన్న జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి అవార్డు ప్రకటించడం ఆలస్యం ఇతర బాషల మీడియాతో పాటు ట్విట్టర్, ఇన్స్ టాలలో ఓర్వలేని శోకాలు మొదలయ్యాయి. ఎంత నటనే అయినప్పటికీ ఒక స్మగ్లర్ గా చేసిన పాత్రను ఎలా గుర్తిస్తారనే విచిత్రమైన లాజిక్ ఒకటి బయటికి తీశారు. ఇంత కన్నా పెద్ద జోక్ మరొకటి ఉండదు. అదెలాగో చూద్దాం. 1987 ‘నాయకుడు’లో కమల్ హాసన్ కి ఇదే అవార్డు ఇచ్చిన సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలి. కరుడుగట్టిన మాఫియా డాన్ వరదరాజన్ ముదలియార్ స్ఫూర్తితో మణిరత్నం సృష్టించిన పాత్ర అది. పాతికేళ్ల క్రితమే జరిగిందనే విషయం మర్చిపోకూడదు.

1999లో షబానా ఆజ్మీ టైటిల్ రోల్ పోషించిన ‘గాడ్ మదర్’కు ఉత్తమ నటిగా పురస్కారం అందించారు. ఈ కథ గుజరాత్ లేడీ డాన్ గా పేరు తెచ్చుకున్న సంతోక్ బెన్ జడేజా కథ ఆధారంగా తీశారు. ఆవిడ మీద పద్నాలుగు హత్య కేసులు, అయిదు వందలకు పైగా ఇతర కేసులున్నాయి. దీనికన్నా ముందు 1997 ‘కలియాట్టం’ అనే చిత్రంలో సురేష్ గోపి పెర్ఫార్మన్స్ కు బెస్ట్ యాక్టర్ ఇచ్చారు. ఆ సినిమాలో అతని పాత్ర భార్య మీద అనుమానంతో ఆమెని హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఇక్కడ చెప్పిన మూడు ఉదాహరణలు సమాజానికి మేలు చేసేవి కాదుగా.

వీటితో పోల్చుకున్నా పుష్పలో బన్నీ క్యారెక్టర్ అంత దారుణమైన వయొలెన్స్ తో ఉండదు. అమాయకులను, మంచి వాళ్ళను దోచుకున్నట్టు చూపించరు. చట్ట వ్యతిరేకంగా స్మగ్లింగ్ చేస్తాడు తప్పించి దారుణాలకు పాల్పడడు. పైగా ఇది కాల్పనిక కథ. నిజంగా జరిగింది కాదు. అలాంటప్పుడు క్రైమ్ ఉన్న హీరోయిజంని నేషనల్ అవార్డుకి గుర్తించకూడదనేది అర్థం లేని వాదన. 1994లో శేఖర్ కపూర్ తీసిన ‘బండిట్ క్వీన్’ కేవలం పెద్దలు మాత్రమే చూసేది. అయినా సీమ బిస్వాస్ కు అవార్డు ఇచ్చారుగా. ఎలా చూసుకున్నా బన్నీకి సంపూర్ణ అర్హత ఉండబట్టే దక్కింది కాబట్టే గిట్టని బ్యాచుల శోకాలు, దీర్ఘాలు 

This post was last modified on August 25, 2023 11:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ లంచాలు.. జ‌గ‌న్ మౌనం రీజ‌నేంటి?

ఒక‌వైపు దేశాన్ని మ‌రోవైపు ప్ర‌పంచ దేశాల‌ను కూడా కుదిపేస్తున్న అంశం… ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌.. ప్ర‌పంచ కుబేరుడు.. గౌతం అదానీ…

39 mins ago

ఐపీఎల్ వేలంలో వీరికి భారీ షాక్

సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోన్న ఐపీఎల్-2025 ఆక్షన్ సందర్భంగా కొందరు క్రికెటర్లు కాసుల పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో మరికొందరు…

7 hours ago

కిస్ కిసిక్కు…ఊ అనిపిస్తుందా ఊహు అనిపిస్తుందా?

పుష్ప 1లో సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా ఊహు అంటావా ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన…

8 hours ago

ఏది సాధించినా చెన్నైకే అంకితం – అల్లు అర్జున్

కనివిని ఎరుగని జనసందోహం మధ్య బీహార్ లో జరిగిన ఈవెంట్ బ్లాక్ బస్టరయ్యాక పుష్ప 2 తాజాగా చెన్నైలో జరిపిన…

8 hours ago

నాకు కాబోయేవాడు అందరికీ తెలుసు – రష్మిక

టాలీవుడ్ లో అత్యంత బిజీగా టాప్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే ముందు గుర్తొచ్చే పేరు రష్మిక…

8 hours ago

ఐపీఎల్ లో వార్నర్ ఖేల్ ఖతం?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దాలో జరుగుతోంది. ఎడారి దేశంలో జరుగుతోన్న ఐపీఎల్ 18వ…

9 hours ago