దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక అరుదైన మైలురాయి అందుకున్నాడు. స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి దాకా ఎన్నో తరాలు, ఎందరో హీరోలకు సాధ్యం కాని గొప్ప ఘనతను అందుకున్నాడు. ఇవాళ ప్రకటించిన 69వ జాతీయ అవార్డుల్లో పుష్ప 1 ది రైజ్ లో నటనకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అనౌన్స్ చేయడం ఆలస్యం బన్నీ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇది లీకు రూపంలో కొన్ని నిమిషాల ముందే వచ్చినప్పటికీ ఏదైనా చివరి క్షణం ట్విస్టు ఉంటుందేమోననే అనుమానంతో మీడియాతో సహా అన్ని వర్గాలు సంయమనం పాటించాయి
ప్యాన్ ఇండియా ఇమేజ్ ని పుష్పతోనే సాధించుకున్న అల్లు అర్జున్ సక్సెస్ లో ఇదో మేలి ముత్యంగా నిలిచిపోతుంది. చాలా సంవత్సరాలుగా తెలుగులో ఎన్నో గొప్ప చిత్రాలు, మరపురాని పెర్ఫార్మన్స్ ఇచ్చిన నటులున్నా టాలీవుడ్ కు ఈ విభాగం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కమల్ హాసన్, అక్కినేని, చిరంజీవి, బాలకృష్ణ లాంటి ఎందరో గొప్ప క్లాసిక్స్ లో నటించినా ఎప్పటికప్పుడు ఆ ఏడాది పోటీ వల్ల ఇది కలగానే నెరవేరకుండా వస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రైజ్ పార్ట్ 1 అడవి దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా తగ్గేదేలే అంటూ చిత్తూరు యాసలో బన్నీ చూపించిన నటన, హావభావాలు జ్యురి సభ్యులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రెండో భాగం షూటింగ్ జరుగుతుండగా ఈ శుభవార్త వినడం కన్నా గొప్ప క్షణం ఇంకేముంటుంది. ప్రకటనకు కొద్దిసమయం ముందే సుకుమార్ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలిసి ఆ ఘట్టాన్ని ఆస్వాదించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప ఇప్పుడీ అవార్డు వల్ల సీక్వెల్ కి ఆల్రెడీ ఉన్న బజ్ అమాంతం మరింత పెరిగిపోవడం ఖాయం. ఏది ఏమైనా టాలీవుడ్డే కాదు యావత్ సౌత్ పరిశ్రమ గర్వపడేలా చేశాడు బన్నీ అలియాస్ అల్లు అర్జున్.
This post was last modified on August 24, 2023 6:54 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…