రామాయణంలోని రామ-రావణ యుద్ధ ఘట్టం ప్రధానంగా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న ఓం రౌత్ ఇది రామాయణ కథ అని చెప్పడానికి జంకుతున్నాడు. ఎందుకంటే ఈ చిత్రంలోని పాత్రలను ఇంతకాలం జనం దృష్టిలో వున్నట్టుగా చూపించడం లేదట. రాముడిని నీలమేఘ శ్యాముడిగా చూపిస్తూ రాగా, రావణుడికి కూడా ఒక ఖచ్చితమైన రూపాన్ని ఇచ్చారు. కానీ ‘ఆదిపురుష్’లో ప్రభాస్ జుట్టు, గడ్డం, మీసం పెంచి మరో రకంగా కనిపించబోతున్నాడు. అలాగే రావణుడు కూడా పది తలలు వగైరా రెగ్యులర్ లుక్‍తో కనిపించబోవడం లేదు.
రామాయణం అని చెప్పి ఇలా చూపిస్తే గొడవలు అవుతాయని, చాలా మంది అభ్యంతరం చెబుతారని, ఇదసలు రామాయణంతో సంబంధం లేని కథ అన్నట్టు మేకర్స్ కట్టు కథ చెబుతున్నారు. ఇదొక మైథలాజికల్ ఫాంటసీ చిత్రమనే అంటున్నారు కానీ ఎక్కడా రాముడి ప్రస్తావన లేదా రామాయణ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
అయితే ఈ సినిమా కథ తెలిసిన నాగ్ అశ్విన్ లాంటి వాళ్లు మాత్రం రాముడిగా ప్రభాస్ కనిసిస్తున్నాడని లీక్ చేసేసారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో విడివిడిగా చిత్రీకరించనున్నారు. కొన్ని పాత్రలకు హిందీ, తెలుగు వెర్షన్స్ లో వేర్వేరు నటీనటులుంటారు.
This post was last modified on August 20, 2020 12:06 am
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…
అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తన అల్లరి చేష్టలతో ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…