తెలుగులో చిన్న బడ్జెట్లో, పెద్దగా పేరు లేని ఆర్టిస్టులతో ఓ కొత్త దర్శకుడు తీసిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించాడు. రెండు కోట్లకు అటు ఇటుగా బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. 20 కోట్లకు పైగా ఆదాయం తెచ్చిపెట్టడం విశేషం. దీన్ని బట్టే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెసో అర్థం చేసుకోవచ్చు.
ఐతే ఈ సినిమా తర్వాత అందులో భాగమైన అందరికీ అవకాశాలు బాగానే వచ్చాయి కానీ.. ఎవ్వరూ అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు. హీరో కార్తికేయ నుంచి దాదాపు పది సినిమాలు వచ్చినా ఏదీ ఆశించిన సక్సెస్ కాలేదు. పాయల్ రాజ్‌పుత్ కెరీర్ అయితే తిరోగమనంలో ఉంది. దర్శకుడు అజయ్ భూపతి కూడా ‘మహాసముద్రం’తో తీవ్రంగా నిరాశ పరిచాడు.
ఐతే ‘మంగళవారం’ మూవీతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని అజయ్, పాయల్ చూస్తుంటే.. ‘బెదురులంక 2012’ మీద కార్తికేయ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాల ఫలితం ఏమో కానీ.. అజయ్-కార్తికేయ కాంబినేషన్లో ‘ఆర్ఎక్స్ 100’ సీక్వెల్ లాంటి సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజయ్‌తో మళ్లీ తాను ఓ సినిమా చేస్తున్నట్లు కార్తికేయ వెల్లడించాడు. ఈ సినిమా ‘ఆర్ఎక్స్-100’ సీక్వెల్ కచ్చితంగా చెప్పాలేనని.. మళ్లీ తమ కలయికలో ఒక సెన్సేషనల్ సినిమా ఉంటుందని అతనన్నాడు.
ప్రస్తుతం రకరకాల కథల మీద చర్చలు జరుగుతున్నట్లు అతను చెప్పాడు. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత తాను కొన్ని కథల విషయంలో తప్పు చేశానని.. కొన్ని మంచి కథలు కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదని కార్తికేయ తెలిపాడు. ‘బెదురులంక 2012’తో తాను కచ్చితంగా గాడిలో పడతానని.. ప్రేక్షకులు ఊహించలేని సర్ప్రైజ్‌లు ఈ సినిమాలో చాలా ఉంటాయని అతనన్నాడు. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 23, 2023 8:49 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…