వచ్చే నెల 15న విడుదల కాబోతున్న స్కంద ఫీవర్ మెల్లగా పెరుగుతోంది. దీనికన్నా ముందు వచ్చే రిలీజుల ప్రమోషన్లు జోరుగా ఉండటంతో ప్రస్తుతానికి రామ్ బృందం కొంచెం నెమ్మదిగా ఉంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ 45 కోట్ల దాకా చేశారనే వార్త ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడీ స్కందకు బాలయ్య అండ దొరకనుంది. త్వరలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన్నే ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్టు టాక్. దర్శకుడు బోయపాటి శీనుతో బాలకృష్ణకున్న స్నేహం, అనుబంధం అందరికీ తెలిసిందే. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సాధించిన జంట ఇది.
ఆ బాండింగ్ తోనే బాలయ్య ఎస్ చెప్పినట్టు తెలిసింది. ఇరవై ఆరున శిల్ప కళా వేదికలో జరిగే ఈవెంట్ కి ఏర్పాట్లు చేస్తున్నట్టు వినికిడి. ట్రైలర్ కూడా అదే రోజు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా స్కంద కంటెంట్ కి సంబంధించి చిన్న టీజర్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. రిలీజ్ చేసిన రెండు పాటలు నీ చుట్టూ చుట్టూ, గండరబాయ్ అంచనాలను పూర్తిగా కాకపోయినా మాస్ కి తగ్గట్టు స్లోగా పబ్లిక్ లోకి వెళ్తున్నాయి. అసలు కథేంటి, యాక్షన్ డ్రామాని ముందే తెలిసినా ఎలాంటి నేపధ్యాన్ని బోయపాటి తీసుకున్నాడనే ప్రశ్నలకు సమాధానం ట్రైలర్ చూశాక కొంతవరకు దొరకొచ్చు.
ముందు వెనుకా తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో స్కందకు చాలా సవాళ్లు ఎదురు కానున్నాయి. వారం ముందు షారుఖ్ ఖాన్ జవాన్ వచ్చి ఉంటుంది. సెప్టెంబర్ 15నే చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీలు ఉన్నాయి. డబ్బింగ్ హక్కులకు బాగానే డిమాండ్ ఉంది. కాబట్టి థియేటర్ల సమస్యను అధిగమిస్తూనే అదిరిపోయే టాక్ తెచ్చుకుంటే స్కందని ఈ కాంపిటీషన్ ఏమీ చేయలేదు. శ్రీలీల నృత్యాలు, గ్లామర్ పబ్లిసిటీ పరంగా బాగానే ప్లస్ అవుతోంది. ది వారియర్ డిజాస్టర్ తర్వాత రామ్ ఎంతో నమ్మకంతో చేస్తున్న స్కంద సక్సెస్ అయితే డబుల్ ఇస్మార్ట్ బిజినెస్ కి మరింత హెల్ప్ అవుతుంది. చూడాలి మరి.
This post was last modified on August 23, 2023 3:13 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…