కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నదే నిజమని తేలిపోయింది. టాలీవుడ్లో తొలిసారిగా ఓ క్రేజీ మూవీ థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి నేరుగా ఆన్ లైన్లో రిలీజ్ కాబోతోంది. ఈ విషయమై అధికారిక ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఇంకా డేట్ చెప్పలేదు కానీ.. ఇందులో విలన్ పాత్ర చేసిన నేచురల్ స్టార్ నాని ఒక వీడియో ద్వారా ఆ సంకేతాలు ఇచ్చేశాడు. ఆ వీడియో చూస్తే ‘వి’ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోందని స్పష్టం అయిపోయింది.
ఈ వీడియోలో ముందుగా థియేటర్లో కూర్చుని పాప్ కార్న్ చూస్తూ నాని సినిమా చూస్తుంటాడు. సినిమా పూర్తయి రోలింగ్ టైటిల్స్ అయిపోతుండగా.. అప్పుడే అయిపోయిందా సినిమా అని ఫీలవుతాడు. తర్వాత అయితేనేం.. మళ్లీ మళ్లీ ఎన్నిసార్లయినా చూసుకోవచ్చుగా అంటూ.. థియేటర్ నుంచి బయటికి వచ్చి తలుపు తీస్తే పక్కన ఇంట్లో వంటగది కనిపిస్తుంది. అంటే నాని సినిమా చూసింది హోం థియేటర్లో అనమాట.
ఆ తర్వాత మారుతున్న సినిమా వీక్షణం గురించి చిన్న ఉపోద్ఘాతం ఇచ్చి.. మిడ్ నైట్ షోలు, ఫస్ట్ డే ఫస్ట్ షోలు, విడుదలకు ముందుండే నెర్వస్‌నెస్.. ఇవన్నీ తాము మిస్సవుతున్నామని.. అలాగే ప్రేక్షకులూ ఆ స్థితిలోనే ఉన్నారని.. కానీ మళ్లీ ఆ సందడి మొదలు కాబోతోందని నాని అన్నాడు. ఆ తర్వాత ‘వి’ సినిమా అతి త్వరలోనే విడుదల కాబోతోందని.. దాని గురించి గురువారం అప్ డేట్ ఇవ్వనున్నామని నాని వెల్లడించాడు. ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ వాళ్లు రూ.32 కోట్లకు కొన్నారని.. సెప్టెంబరు తొలి వారంలో ఈ చిత్రం నేరుగా ఆన్ లైన్లో రిలీజవుతుందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 19, 2020 9:05 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…