Movie News

బేబీ నిర్మాత విచిత్రమైన లాజిక్

హీరోల మీద ఎంతైనా అభిమానం ఉండొచ్చు కానీ అది మేజిక్ తో పాటు లాజిక్ కు కూడా లోబడాలి. అంతే తప్ప ఇష్టమైన స్టార్ ఏం చేసినా సమర్ధించే తీరులో ఉండకూడదు. మాములుగా స్టేజి మీద ప్రాసలతో కూడిన ప్రసంగాలతో ఊపేసే బేబీ నిర్మాత ఎస్కెఎన్ నిన్న హైదరాబాద్ జెఆర్సి కన్వెన్షన్ లో జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు. ఇండస్ట్రీ రావడానికి స్ఫూర్తి ఇచ్చిందే మెగాస్టారని పలు సందర్భాల్లో అతనే చెప్పడం కాదు అల్లు అర్జున్ సైతం ఇతని గురించి అదే చెప్పిన సంగతి మర్చిపోకూడదు. నిన్న తన భక్తిని మరోసారి ప్రదర్శించారు ఎస్కెఎన్.

భోళా శంకర్ లో బాస్ మునుపెన్నడూ లేనంత అందంగా ఉన్నారని, కేవలం సోషల్ మీడియాలో ఒక వర్గం ట్రాప్ లో పడి స్వయంగా అభిమానులే దాన్ని డిజాస్టర్ చేసుకున్నారని ఒక విచిత్రమైన స్టేట్ మెంట్ ఇచ్చారు. అదేంటి కాస్ట్యూమ్స్ బాగుంటే సినిమా హిట్ అయ్యే పనైతే బ్రహ్మోత్సవం, అజ్ఞాతవాసిలు కుడా హండ్రెడ్ డేస్ ఆడతాయిగా.  దేనికైనా కంటెంట్ ముఖ్యం. భోళా శంకర్ మీద పనిగట్టుకుని ఎవరూ బురద చెల్లలేదు. ఒకవేళ చేయాలనుకున్నా అంత వీక్ ఛరిష్మా అయితే చిరంజీవిది కాదు. అలాంటప్పుడు ఈజీగా ఎవరు డ్యామేజ్ చేయగలరు. మ్యాటర్ తేడా ఉంది కాబట్టే సినిమా పోయింది.

అసలు మూవీలోనే బోలెడు లోటుపాట్లు ఉన్నప్పుడు వాటిని హుందాగా ఒప్పేసుకుని బాస్ మళ్ళీ బ్యాక్ అవుతారని చెప్పుకున్నా సరిపోయేది. అది విడిచిపెట్టి మనమే ఫ్లాప్ చేసుకున్నామని చెప్పడం తర్కానికి అందదు. చిరంజీవి ప్రత్యక్ష హాజరు లేకపోయినప్పటికీ పలువురు అతిధులు, దర్శకులతో ఈవెంట్ బాగానే జరిగింది. మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో రాలేదు. అయినా గెలుపోటములకు అతీతంగా శిఖరమంత సాధించిన చిరంజీవికి మద్దతు ఇవ్వడమంటే ఊరికే పొగడ్తలతో ముంచెత్తడం కాదు, అవసరమైనప్పుడు తప్పెక్కడ జరుగుతుందో చెప్పడం కూడా అవసరమేనని గుర్తించాలి.

This post was last modified on August 23, 2023 11:49 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

సతీసమేతంగా అమెరికాకు చంద్రబాబు

ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు,…

59 mins ago

పుష్ప 2 పోటీ – తగ్గనంటున్న శివన్న

ఇంకో మూడు నెలల్లో ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రైజ్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు…

1 hour ago

లవ్ మీ మీద బండెడు బరువు

సింగల్ స్క్రీన్లు అధిక శాతం తాత్కాలికంగా మూతబడి, కుంటినడనన మల్టీప్లెక్సులను నెట్టుకొస్తున్న టైంలో ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్ లవ్…

2 hours ago

భైరవ బుజ్జిలను తక్కువంచనా వేయొద్దు

నిన్న ఊరించి ఊరించి ఆలస్యంగా విడుదల చేసిన కల్కి 2898 ఏడిలోని బుజ్జి మేకింగ్ వీడియో చూసి అభిమానుల నుంచి…

3 hours ago

కుప్పం బాబుకు లక్ష ‘కప్పం’ చెల్లిస్తుందా ?

కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడుకు పెట్టని కోట. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ టీడీపీ తప్ప…

3 hours ago

మీడియం హీరోల డిజిటల్ కష్టాలు

స్టార్ ఇమేజ్ ఎంత ఉన్నా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్న డిజిటల్ మార్కెట్ వాళ్ళకో సవాల్ గా మారిపోయింది. కరోనా…

5 hours ago