కొత్త సినిమాల అసలు విడుదల తేదీకి ముందు రోజు ప్రీమియర్లు వేయడం ఈ మధ్య చాలా సినిమాలకు కలిసి వస్తోంది. దీంతో మీడియం బడ్జెట్ తో తీసిన నిర్మాతలందరూ ఇదే బాట పడుతున్నారు. టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా దెబ్బ గట్టిగా పడుతుందని తెలిసి కూడా రిస్క్ కి సై అంటున్నారు. బేబీ, మేం ఫేమస్, రైటర్ పద్మభూషణ్, మేజర్, 777 చార్లీ లాంటి వాటికి ఇవి ఎంత ప్లస్ అయ్యాయో గుర్తేగా. కానీ ఇదే స్ట్రాటజీ రంగబలి, హిడింబ లాంటి వాటికి రివర్స్ కొట్టింది. అయినా సరే కంటెంట్ మీద నమ్మకంతో ఈ ఫ్రైడే రిలీజులు కూడా ఎర్లీ ప్రీమియర్లకు ఓటేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
కార్తికేయ బెదురులంక 2012 గురువారమే గుంటూరు, వైజాగ్, కాకినాడలో షోలు ఫిక్స్ చేసి ఆమేరకు ఆన్ లైన్ లో బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు. తెలంగాణతో పాటు ఆంధ్రలోని ఇతర ప్రాంతాల్లోనూ డిమాండ్ బట్టి ప్లాన్ చేస్తారు. యుగాంతం పుకార్ల ఆధారంగా దర్శకుడు క్లాక్స్ తీసిన ఈ కామెడీ థ్రిల్లర్ చాలా వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కార్తికేయకు దీని సక్సెస్ చాలా కీలకం. శనివారం రాబోతున్న కన్నడ డబ్బింగ్ మూవీ బాయ్స్ హాస్టల్ కి సైతం ముందు రోజు రాత్రి షోలు ప్లాన్ చేసి టికెట్ల అమ్మకాలు షురూ చేశారు.
ఎటొచ్చి గాండీవధారి అర్జున, కింగ్ అఫ్ కొత్తలు ప్రస్తుతానికి ఈ నిర్ణయం తీసుకోలేదు. దుల్కర్ సల్మాన్ కి ఎంత క్రేజ్ ఉన్నా మలయాళంతో పాటు సమాంతరంగా రిలీజ్ ఉంది కాబట్టి 24న చూడటం తప్ప వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. వరుణ్ తేజ్ నిర్మాతలు సైతం ఈ విషయంలో ఎలాంటి కదలిక చూపించడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని ఫ్రైడే కోసం వెయిట్ చేస్తున్నారు. కాంపిటీషన్ ఇంత ఎక్కువగా ఉంది కాబట్టే బెదురులంక 2012, బాయ్స్ హాస్టల్ ముందే షోలు వేసుకుని ఒకరకంగా మంచి పనే చేశారు. రిజల్ట్ ఎలా వస్తుందో లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on August 22, 2023 10:32 pm
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…