అసలెలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనం రేపిన కాంతారకు ప్రీక్వెల్ రూపొందబోయే సంగతి తెలిసిందే. అంటే ఫస్ట్ పార్ట్ లో చూసిన కథకు ముందు ఏం జరిగిందనేది ఇందులో చూపించబోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే బాహుబలి ఫార్ములా అన్న మాట. కొడుకు బిగినింగ్ నడిపించాక తండ్రి ఫ్లాష్ బ్యాక్ ని కంక్లూజన్ లో రివీల్ చేసినట్టు ఇక్కడ కూడా అదే ఫార్మాట్ వాడబోతున్నారు. కాంతారకు 16 కోట్లు ఖర్చు పెట్టిన హోంబాలే ఫిలిమ్స్ ఇప్పుడు ఏకంగా 125 కోట్లకు ఓకే చెప్పిందట. కేవలం ప్రీ ప్రొడక్షన్ కే ఇరవై పైగానే ఖర్చు పెట్టాల్సి వస్తోందని బెంగళూరు టాక్.
ఈ లెక్కన కాంతార 2 ఊహలకు మించి ఉంటుంది. బహు భాషల్లో ఇది సాధించిన విజయం చూసి హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. మొదటి వెర్షన్ లో స్టార్ క్యాస్టింగ్ ఉండదు. మొత్తం ఇతని మీదే నడిచింది. పేరున్న ఆర్టిస్టు ఒక్క కిషోర్ మాత్రమే కనిపించాడు. ఈసారి అలా కాకుండా సీనియర్ నటీనటులతో పాటు ఊహించని తారాగణాన్ని రిషబ్ సెట్ చేసుకోబోతున్నట్టు తెలిసింది. 2024 వేసవిలో ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలనే సంకల్పంతో ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ లో దేవర, పుష్ప 2 లాంటివి ఉన్నాయి కాబట్టి క్లాష్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
కాంతార షూటింగ్ నవంబర్ నుంచి మొదలవుతుంది. ఆరు నెలల్లో పూర్తి చేసి మరో అరవై రోజులు పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ కి కేటాయించబోతున్నారు. సహజంగానే దీని మీద అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి కాబట్టి రిషబ్ శెట్టి దానికి అనుగుణంగానే సిద్ధమవుతున్నాడు. ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ మొదలయ్యింది. దేవుడు ప్రత్యేకంగా ఒక తెగవాళ్లనే ఎందుకు పూనుతాడు లాంటి ప్రశ్నలకు సమాధానం ఇందులో చూపించబోతున్నారు. కెజిఎఫ్, సలార్ తర్వాత హోంబాలే బ్యానర్ కి సీక్వెల్ సిరీస్ లో రాబోతున్న మూడో సినిమా కాంతారనే.
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…