అల్లు అర్జున్, సుకుమార్‌ల కలయికలో వచ్చిన ‘పుష్ప’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌లో ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. డివైడ్ టాక్‌ను తట్టుకుని ఈ చిత్రం తెలుగులో భారీ వసూళ్లే సాధించింది. ఇక నార్త్ ఇండియాలో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ‘పుష్ప’ హిందీ వెర్షన్ వసూళ్ల మోత మోగిస్తూ సర్ప్రైజ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రిలీజ్ తర్వాత ఆ సినిమా పాటలు.. డైలాగ్స్.. బన్నీ మేనరిజమ్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. దీంతో ‘పుష్ప-2’కు ఎక్కడ లేని హైప్ వచ్చింది.
అసలే నెమ్మదిగా సినిమాలు తీసే సుకుమార్.. ‘పుష్ప-2’పై అంచనాలు పెరిగిపోవడంతో స్క్రిప్టు మీద మళ్లీ పని చేసి ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి చాలా టైం తీసుకున్నాడు. షూటింగ్ కూడా అనుకున్నంత వేగంగా సాగట్లేదు. ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే రావాల్సిన సినిమాను వచ్చే ఏఢాది వేసవికి వాయిదా వేశారు.
చాలామందికి వచ్చే ఏడాది సమ్మర్లో అయినా ‘పుష్ప-2’ వస్తుందా రాదా అన్న సందేహాలున్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా సెకండ్ పార్ట్ షూట్ 40 శాతం మాత్రమే పూర్తయింది. సుక్కు స్పీడుకి, పర్ఫెక్షన్‌కి వేసవికల్లా వివిధ భాషల్లో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయడం పెద్ద టాస్కే అని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు చిత్ర బృందం పక్కా షెడ్యూళ్లతో సిద్ధమవుతోందట.
జనవరి నెలాఖరుకల్లా షూట్ మొత్తం పూర్తి చేసి.. తర్వాత ఒక నెలన్నర పోస్ట్ ప్రొడక్షన్ కోసం సమయం వెచ్చించి మార్చి నెలాఖర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ప్రణాళికతో ఉన్నారట. బన్నీ కూడా ఈ విషయంలో సుకుమార్ మీద ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇంకో విశేషం ఏంటంటే.. సినిమాకు ఓపెన్ ఎండింగ్ ఉంటుందట. ఈ కథను ఒక దగ్గర ముగించి.. పార్ట్-3 తీయడానికి అవకాశం ఉండేలా ఓపెన్ ఎండింగ్ ఇస్తారట.
‘కేజీఎఫ్’ ఫ్రాంఛైజీ రెండో భాగంతో ముగిసిపోతుందని అందరూ భావించగా.. చాప్టర్-2లో ఆ కథను ఒక దగ్గర ఎండ్ చేసి, చాప్టర్-3కి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీలును బట్టి ప్రశాంత్ నీల్, యశ్ ‘కేజీఎఫ్-3’ చేయాలని అనుకుంటున్నారు. ఈలోపు వేర్వేరు ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. సుక్కు, బన్నీ ఇలాగే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప-3’ దిశగా హింట్ ఇచ్చి.. పుష్ప-2 తర్వాత విడివిడిగా కొత్త సినిమా చేయబోతున్నారు. పుష్ప-2 రిజల్ట్, ఇతర సమీకరణాలను బట్టి భవిష్యత్తులో థర్డ్ పార్ట్ చేస్తారు.
This post was last modified on August 23, 2023 12:45 pm
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…