టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన రామ్ చరణ్, తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో అగ్ర నిర్మాత దిల్ రాజు సినిమాను అనౌన్స్ చేసినపుడు మెగా అభిమానులు మామూలుగా ఎగ్జైట్ కాలేదు. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ముందే ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడమే కాక.. చకచకా కొన్ని షెడ్యూళ్లు పూర్తి చేశారు. ఒకప్పుడు ఉన్న అంచనాల ప్రకారం అయితే ఈ ఏడాది సంక్రాంతికే ఈ చిత్రం విడుదల కావాల్సింది.
కానీ శంకర్ మధ్యలో ఆగిన ‘ఇండియన్-2’ను టేకప్ చేయాల్సి రావడంతో మొత్తం కథ మారిపోయింది. ‘గేమ్ చేంజర్’ వెనక్కి వెళ్లిపోయింది. ఈ రెండు చిత్రాలనూ సమాంతరంగా పూర్తి చేసేలా ముందు ప్లానింగ్ జరిగినా.. అలా సాధ్యపడలేదు. ‘ఇండియన్-2’ మీదే శంకర్ చాలా కాలంగా పని చేస్తున్నాడు. ‘గేమ్ చేంజర్’ను ఒక దశలో పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆ సినిమా సంగతి ఎటూ తేలకుండా పోయింది.
ఐతే చరణ్ అభిమానులేమో ఈ సినిమా గురించి అప్‌డేట్స్ ఏమీ లేవంటూ నిర్మాత దిల్ రాజును టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు చాలా కాలంగా. ఐతే ఈ సినిమా విషయంలో దిల్ రాజే పెద్ద బాధితుడు అనే విషయం అభిమానులు అర్థం చేసుకోలేకపోయారు. దాదాపు రెండొందల కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమా ఏళ్లకు ఏళ్లు ఆలస్యం అయితే నిర్మాతకు ఎంత నష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ చేసేదేమీ లేక శంకర్ కోసం ఎదురు చూస్తున్నాడు రాజు. ఇన్నేళ్ల కెరీర్లో రాజుకు ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. కానీ అభిమానులేమో ఇప్పటికీ రాజును వదడం లేదు.
తాజాగా తన ఫ్యామిలీ హీరో అశిష్ కొత్త సినిమా మొదలైన సందర్భంగా ‘గేమ్ చేంజర్’ అప్‌డేట్స్ కోసం మీడియా వాళ్లు ఆయన్ని కదిపే ప్రయత్నం చేశారు. అభిమానుల డిమాండ్ గురించి ప్రస్తావించారు. దానికాయన బదులిస్తూ.. ‘‘మనమేం చేయలేం. డైరెక్టర్ గారి చేతుల్లోనే అంతా ఉంది. ఆయన ఇచ్చినపుడు మాత్రమే అప్‌డేట్స్ బయటికి వస్తాయి’’ అంటూ చేతులెత్తేశారు. రాజు ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడో చెప్పడానికి ఈ మాటలు రుజువు. ఇప్పటికైనా ఫ్యాన్స్ పరిస్థితి అర్థం చేసుకుని రాజును టార్గెట్ చేయడం మానేస్తే బెటర్.
This post was last modified on August 22, 2023 3:19 pm
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్…
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలకు కాస్తంత గ్యాప్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి డాకు…