దశాబ్దాల గ్యాప్ తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా మెగాస్టార్ 157 అఫీషియల్ గా ప్రకటించారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై బింబిసార ఫేమ్ మల్లిడి వేణు(వశిష్ట) దర్శకత్వంలో రూపొందబోయే ఈ ప్యాన్ ఇండియా మూవీకి టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి కానీ తొందరపడి ఇప్పుడే ఎందుకు అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో ఆగిపోయారు. పోస్టర్ లో ఓ పెద్ద శిల మీదన బంగారు నక్షత్రం గుర్తుపై పంచ భూతాలను సూచిస్తూ, అయిదు గళ్ళను నింపుతూ మధ్యలో త్రిశూలాన్ని పొందుపర్చడం చూస్తే ఇదేదో ఆషామాషీ ప్లానింగ్ లా కనిపించడం లేదు.
కాన్సెప్ట్ కు సంబంధించిన లుక్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ రివీల్ చేయలేదు. ప్రచారంలో ఉన్న ఏ పేరూ పోస్టర్ లో లేదు. సంగీత దర్శకుడు కీరవాణి, కెమెరామెన్ చోటా కె నాయుడులతో సహా ఎవరినీ పొందుపరచలేదు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరిని పరిచయం చేసే అవకాశం ఉంది. బింబిసార తర్వాత దాని సీక్వెల్ చేయాల్సి ఉన్నా ఊహించని విధంగా వశిష్ట మెగా 157 వైపు వచ్చేశాడు. ఈ లెక్కన సుష్మిత కొణిదెల నిర్మించబోయేది 156 అవుతుంది. విషెస్ చెప్పారు కానీ డైరెక్టర్ తో సహా ఎవరి నేమ్ లేకుండా గోల్డ్ బాక్స్ బ్యానర్ తరఫున శుభాకాంక్షలు చెప్పారు
పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఫ్యాన్స్ కి సరైన బహుమతే దక్కింది. రీమేకులతో విసుగొచ్చి భోళా శంకర్ డిజాస్టర్ తో అభిమానుల అసహనం పీక్స్ కి చేరిన తరుణంలో ఈ ప్రకటన చాలా ఊరటనిస్తోంది. అయితే బడ్జెట్ పరంగా చాలా భారీ చిత్రం కాబట్టి షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు, రిలీజ్ ఎపుడు ఉంటుందనే వివరాలు ఇప్పుడప్పుడే బయట పడవు. అంజి తర్వాత ఈ జానర్ కి చిరంజీవి దూరంగా ఉన్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి తరహా మూవీ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్ ఫైనల్ గా మెగా 157 రూపంలో తీరబోతోంది. వశిష్ట ఎలాంటి విజువల్ వండర్ అందిస్తాడో చూడాలి.
This post was last modified on August 22, 2023 11:36 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…