రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి అనౌన్స్ మెంట్లు ఉంటాయోనని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భోళా శంకర్ ఫలితంతో నిరాశ చెందిన మెగా కాంపౌండ్ వ్యూహాత్మకంగానే కళ్యాణ్ కృష్ణ సినిమా కాస్త పెండింగ్ లో ఉంచింది. దాని స్థానంలో ఇంకొంచెం లేట్ చేయాలనుకున్న బింబిసార ఫేమ్ మల్లిడి వేణు అలియాస్ వశిష్ట దర్శకత్వంలో చేయబోయే ప్యాన్ ఇండియా మూవీని రేపు ప్రకటన రూపంలో ఇవ్వబోతున్నట్టు తెలిసింది. కాన్సెప్ట్ పోస్టర్ తో పాటు చిన్న టీజర్ లాంటిది ఏదైనా ఉండొచ్చని టాక్. చిరు లుక్ రివీల్ చేస్తారా లేదానేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇది పూర్తిగా సోషియో ఫాంటసీ. బడ్జెట్ కూడా ఎక్కువే కానుంది. అయినా సరే మార్కెట్ లెక్కలవి వేసుకోకుండా ప్లాన్ చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి ఫిక్స్ అయినట్టే. 1995 ఎస్పి పరశురామ్ తర్వాత మళ్ళీ ఈ కాంబో సాధ్యపడలేదు. మణిశర్మ పేరు కూడా పరిశీలనకు వచ్చిందన్నారు కానీ ఏదైనా అనూహ్య నిర్ణయం ఉంటే తప్ప పేరు ఉండకపోవచ్చు. కెమెరా మెన్ గా చోటా కె నాయుడుని తీసుకున్నారు. సీనియర్ మోస్ట్ ఛాయాగ్రాహకులైనప్పటికీ ఇప్పటి జనరేషన్ వాళ్ళను తీసుకోవాలని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడినప్పటికీ వశిష్ఠ మాత్రం డెబ్యూ టీమ్ నే కొనసాగించబోతున్నారు
చిరంజీవి అందుబాటులో లేరు కాబట్టి ప్రత్యక్షంగా ఆయన కుటుంబ సభ్యులతో గడపడం ఉండకపోవచ్చు. చిన్న చికిత్స కోసం ఢిల్లీ వెళ్లిన చిరు ఎప్పుడు వచ్చేది ఇంకా చెప్పలేదు. మరోవైపు హైదరాబాద్ జెఆర్సి కన్వెన్షన్ సెంటర్ లో ఫ్యాన్స్ ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. గెస్టులు ఎవరు వస్తారనేది తెలియదు కానీ వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ లైతే కన్ఫర్మ్ గా ఉంటారు. చరణ్ కోసం ట్రై చేస్తున్నా వచ్చేది లేనిది క్లారీటీ లేదు. ఒకవేళ భోళా శంకర్ హిట్ అయ్యుంటే ఆ ఉత్సాహం వేరేగా ఉండేది కానీ రేపు జోష్ తేవాల్సిన భారం మొత్తం యువి బృందం మీదే ఉంది.
This post was last modified on August 22, 2023 6:13 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో సంక్రాంతి సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…