బాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అమ్మాయి కంగనా రనౌత్. ఐతే పెద్ద రేంజికి వెళ్లాం కదా అని.. గతంలో జరిగిన చేదు అనుభవాలను మరిచిపోయి, అక్కడి పెద్దలతో కలివిడిగా తిరుగుతూ.. మొహర్బానీలు చేస్తూ.. ‘అందరి మనిషి’గా గుర్తింపు పొందడానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నించలేదు.
తన ‘గత’ జీవితంలో విలన్లుగా ఉన్న వాళ్లు, తన లాంటి వాళ్లను ఎదగనీయకుండా చేయడానికి ప్రయత్నించే వాళ్లందరినీ టార్గెట్ చేసుకుని ఆమె కొన్నేళ్లుగా రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్లో స్టార్ కిడ్స్ అన్నా.. వారిని ప్రోత్సహించే వాళ్లన్నా కంగనాకు ఎంత మంటో తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆలియా భట్, కరణ్ జోహార్ లాంటి వాళ్లను తరచుగా టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేస్తుంటుంది కంగనా. తాజాగా కరణ్ జోహార్ మరోసారి పడ్డ కంగనా.. ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఐతే కంగనా కొన్నిసార్లు మరీ శ్రుతిమించి పోతుండటంతో ఆమె ఒక న్యూసెన్స్‌లా తయారవుతోందని విమర్శలు చేసే తటస్థులూ లేకపోలేదు. లెజెండరీ యాక్టర్ నసీరుద్దీన్ షా అలాంటి వ్యాఖ్యలే చేశారు తాజాగా. సగం తెలివితో మాట్లాడే వాళ్ల వ్యాఖ్యలకు విలువ ఉండదని, వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. కంగనా పేరెత్తకుండా ఆమె ఇటీవల చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఉటంకిస్తూ ఓ ఇంటర్వ్యూలో విమర్శలు చేశారు నసీరుద్దీన్.
ఐతే అవతలున్నది ఎంతటి వారైనా తనను విమర్శిస్తే కంగనా ఊరుకునే రకం కాదు. కానీ నసీరుద్దీన్ విషయంలో మాత్రం ఆమె నోరు జారలేదు. ఇంతకుముందు నసీరుద్దీన్ తనను ఎంతగా పొగిడింది.. తన సమకాలీనులైన నెపోటిజం బ్యాచ్‌తో పోలిస్తే తాను సాధించిన అవార్డులు, ఘనతల గురించి ఎంత గొప్పగా చెప్పిందీ ఆమె గుర్తు చేసింది.
తాను గనుక ప్రకాష్ పదుకొనే లేదా అనిల్ కపూర్ కూతురినైతే ఆయనిలా పొగిడేవాళ్లా అని ఆమె ప్రశ్నించింది. గత ఏడాది నసీరుద్దీన్‌ను తాను ఇంటర్వ్యూ చేసినప్పటి వీడియోను పోస్ట్ చేసి ఆయనకు ఓ ‘నమస్కారం’ పెట్టింది. నసీరుద్దీన్‌ను విమర్శించనైతే విమర్శించలేదు కానీ.. ఆమె శత్రువుల జాబితాలోకి ఓ కొత్త పేరు వచ్చినట్లే అని భావిస్తున్నారు.
This post was last modified on August 20, 2020 3:18 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…