ఊహించని కాంబినేషన్ తో రూపొందిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వచ్చే నెల 7న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో పాయింట్ గురించి చూచాయగా హింట్స్ ఇవ్వడం తప్ప టీజర్ లోనూ స్టోరీని పెద్దగా రివీల్ చేయలేదు. అందుకే అందరి కళ్ళు ట్రైలర్ మీదే ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లార్జ్ పిసిఎక్స్ స్క్రీన్ లో దీని లాంచ్ ఈవెంట్ చేశారు. చాలా గ్యాప్ తో అనుష్క చేసిన ఫుల్ లెన్త్ రోల్ మూవీ కావడంతో స్వీటీ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. జాతిరత్నాలు తర్వాత అమాంతం ఫాలోయింగ్ పెరిగిన నవీన్ పోలిశెట్టి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు.
కథ గుట్టు విప్పేశారు. ఇంజనీరింగ్ చదివినా స్టాండప్ కమెడియన్ గా ఉపాధి చూసుకున్న యువకుడు సిద్దు(నవీన్ పోలిశెట్టి) ఇంట్లో తల్లి తండ్రులు ఎంత పోరు పెడుతున్నా రూటు మార్చుకోడు. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనాలని చూస్తున్న లేడీ చెఫ్ అంకిత(అనుష్క శెట్టి)కి ఇతనే కరెక్ట్ ఛాయస్ అనిపిస్తుంది. ముందు ఒప్పుకున్న సిద్దు ఆమెను ప్రేమలో దింపి తర్వాత పెళ్లి చేసుకోవచ్చని ప్లాన్ చేసుకుంటాడు. కానీ అంకిత చాలా సీరియస్ గానే మగ తోడు కోరుకోవడం లేదని తెలిశాక వీళ్ళ జీవితంలో అనూహ్య మార్పులు వస్తాయి. ఈ జంట ప్రయాణం చివరికి ఏ గమ్యం చేరుకుందనేది తెరమీద చూడాలి.
దర్శకుడు మహేష్ బాబు సన్నివేశాలను చాలా క్యూట్ గా రూపొందించాడు. నవీన్ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా వాడుకునేలా డైలాగులు రాసుకున్న తీరు నవ్వులు పూయించింది. పాయింట్ ఊహించని విధంగా కొంత కాంట్రావర్సీగా అనిపిస్తున్నా అనుష్క పాత్ర వెనుక ఉన్న బలమైన కారణాన్ని దాచి పెట్టారు. గోపి సుందర్ నేపధ్య సంగీతం, రధన్ పాటలు ఈ కూల్ అండ్ డిఫరెంట్ స్టోరీకి మంచి ఫీల్ తీసుకొచ్చాయి. నవీన్ పోలిశెట్టి, అనుష్కల మధ్య కెమిస్ట్రీ డిఫరెంట్ గా ఉంటూనే ఆకట్టుకుంది. కంటెంట్ కూడా ఇలాగే ఉంటే మరో కూల్ ఎంటర్ టైనర్ వచ్చే నెలలో హిట్టు కొట్టడానికి సిద్ధమైనట్టే
This post was last modified on August 21, 2023 7:55 pm
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…
టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…
మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్…
టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…