టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు చాలామంది కొత్త దర్శకులను పరిచయం చేశాడు. వారిలో పలువురు స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్, శ్రీకాంత్ అడ్డాల, వంశీ పైడిపల్లి.. ఇలా జాబితా కొంచెం పెద్దదే. తాను పరిచయం చేసిన దర్శకుడు ఫ్లాప్ ఇచ్చినా సరే.. అతడికి సక్సెస్ వచ్చే వరకు తన కాంపౌండ్లోనే పెట్టుకుంటాడు రాజు. ఇలా చాన్నాళ్ల పాటు రాజుతో కొనసాగిన దర్శకుల్లో వేణు శ్రీరామ్ ఒకడు.
అతను ‘ఓ మై ఫ్రెండ్’ అనే ఫ్లాప్ మూవీతో దర్శకుడయ్యాడు. అయినా అతణ్ని నమ్మి ‘ఎంసీఏ’ చేయగా.. అది కమర్షియల్‌గా మంచి ఫలితాన్నే అందించింది. వేణు తొలి సినిమా తర్వాత వచ్చినట్లే రెండో సినిమాకు కూడా గ్యాప్ తప్పలేదు. కానీ ఈసారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీకి దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చింది. ఆ అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకుని ‘వకీల్ సాబ్’తో సక్సెస్ సాధించాడు వేణు.
కానీ మళ్లీ వేణు కెరీర్లో గ్యాప్ తప్పలేదు. అల్లు అర్జున్‌తో అనుకున్న ‘ఐకాన్’ ఎటూ తేలకుండా పోయింది. ఇంకే స్టార్ హీరో కూడా దొరకలేదు. చివరికి నితిన్‌తో సంప్రదింపులు జరిగాయి. అతడితోనే సినిమా ఓకే అయింది. దీంతో పవన్ తర్వాత పవన్ ఫ్యాన్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు వేణు. వీరి కలయికలో ఒక యాక్షన్ డ్రామా రాబోతోందట. కొంచెం పెద్ద బడ్జెట్లోనే సినిమా ఉంటుందట.
ఎప్పట్లాగే వేణు కొత్త సినిమాను కూడా దిల్ రాజే ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. నితిన్‌తో ‘దిల్’ లాంటి బ్లాక్ బస్టర్, ‘శ్రీనివాస కళ్యాణం’ లాంటి డిజాస్టర్ తీశాడు రాజు. ఇప్పుడు వీరి కలయికలో మూడో సినిమా రాబోతోంది. ప్రస్తుతం నితిన్.. వక్కంతం వంశీ డైరెక్షన్లో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ చేస్తున్నాడు. దాని చిత్రీకరణ చివరి దశలో ఉంది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి తన పని పూర్తయ్యాక వేణు సినిమాను పట్టాలెక్కిస్తాడు నితిన్.
This post was last modified on August 21, 2023 6:23 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…