మాములుగా ఒక స్టార్ హీరో సినిమా బడ్జెట్ వల్ల రెండు మూడేళ్లు నిర్మాణంలో ఉండటం సహజం. రాజమౌళి లాంటి వాళ్లయితే దానికి న్యాయం చేకూరుస్తూ ప్యాన్ ఇండియా మూవీస్ ని అద్భుతంగా తీస్తారు. అయితే యాక్షన్ ఎంటర్ టైనర్ కి పది సంవత్సరాలు పట్టడం అంటే మహా విచిత్రం. చియాన్ విక్రమ్ గా మనకు అపరిచితుడు లాంటి బ్లాక్ బస్టర్ల ద్వారా దగ్గరైన ఈ విలక్షణ హీరో నటించిన ధృవ నచ్చత్తిరమ్ షూటింగ్ 2013లో మొదలైంది. ముప్పాతిక భాగం తీశాక ఏవేవో కారణాల వల్ల ఆగిపోయింది. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ చేతులు ఎత్తేసి యాక్టింగ్ వైపు వెళ్లిపోయారు.
కట్ చేస్తే ఇప్పుడు దీనికి మోక్షం కలిగింది. యుద్ధ కాండం పేరుతో మొదటి భాగాన్ని దసరా పండగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ ఇందులో హీరోయిన్. అయితే విజయదశమికి ఆల్రెడీ విపరీతమైన పోటీ నెలకొంది. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో, శివరాజ్ కుమార్ ఘోస్ట్ నువ్వా నేనాని తలపడుతున్నాయి. మధ్యలో రావడం వల్ల విక్రమ్ కు కలిగే నష్టమే ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ చెప్పినవాటిలో మూడింటికి విపరీతమైన క్రేజ్ ఉంది. అనవసరంగా తలపెడితే డ్యామేజ్ తప్ప ఏం ప్రయోజనం లేదు .
త్వరలోనే దీనికి సంబందించిన నిర్ణయం తీసుకోబోతున్నారు. ధృవ నచ్చత్తిరమ్ ప్రొడ్యూసర్లు కేవలం తమిళ మార్కెట్ నే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అయినా కూడా రిస్కే. హరీష్ జైరాజ్ సంగీతం అందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ఏడుగురు కెమెరా మెన్ లు పని చేశారు. మనోజ్ పరమహంస, రవిచంద్రన్, కథిర్ లాంటి ప్రముఖులు వాళ్లలో ఉన్నారు. ఇంత పెద్ద టీమ్ ని, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గ్రాండియర్ ని ఇలా ఇంత సుదీర్ఘమైన కాలం ల్యాబులో మగ్గేలా చేయడం నిజంగా ట్రాజెడీ. ఫ్యాన్స్ లోనే దీని మీద ఆసక్తి తగ్గిపోయింది. ప్రమోషన్లు ఎలా చేసి బజ్ తెస్తారో చూడాలి మరి.
This post was last modified on August 21, 2023 12:37 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…