కెజిఎఫ్ విజయంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత కీలక పాత్ర పోషించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లి సెంటిమెంట్ పాటను సైతం ఛార్ట్ బస్టర్ చేయడం సంగీత దర్శకుడు రవి బస్రూర్ కే చెల్లింది. అయితే ఆ తర్వాత తన నుంచి మళ్ళీ ఆ స్థాయి మేజిక్ జరగలేదు. కెజిఎఫ్ రెండు భాగాల మధ్యలో, ఆ తర్వాత ఆయన చెప్పుకోదగ్గ సినిమాలు చేశారు. కానీ ఏవీ చెప్పుకోదగ్గ రేంజ్ లో ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. కబ్జా తీవ్రంగా నిరాశపరచగా కేవలం బీజీఎమ్ ఇచ్చిన శ్రీకాంత్ మార్షల్, అజయ్ దేవగన్ భోళా, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛత్రపతి ఇవేవి కనీస స్థాయిలో మెప్పించలేకపోయాయి.
ఇప్పుడు భారమంతా సలార్ మీదే ఉంది. స్వంత ఊరి రికార్డింగ్ స్టూడియోలో ప్రశాంత్ నీల్ తో కలిసి ఈ పని మీదే ఉన్న రవి బస్రూర్ చేతిలో ఏడుకి పైగా సినిమాలున్నాయి. టైగర్ శ్రోఫ్ గణపథ్, నిఖిల్ స్వయంభు, గోపీచంద్ భీమా, శివ రాజ్ కుమార్ భైరతి రనగల్, సత్యదేవ్ జీబ్రా, ధృవ సర్జ మార్టిన్ వాటిలో కీలకమైనవి. నేపధ్య సంగీతంలో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసి దూసుకుపోతున్న అనిరుద్ రవిచందర్ లాంటి వాళ్ళతో పోటీ పడే సత్తా ఉన్న రవి బస్రూర్ తిప్పి తిప్పి ఒకే తరహా స్కోర్ ఇస్తున్నాడన్న కామెంట్స్ కి చెక్ పడాలంటే ఒక డిఫరెంట్ ఆల్బమ్ పడాలి.
అది సలార్ తో నెరవేరితేనే మిగిలినవాటి మీద మ్యూజిక్ లవర్స్ ఆశలు పెట్టుకుంటారు. టాలీవుడ్ వరకు తమన్ ఈ విషయంలో దూసుకుపోతున్నాడు . దేవిశ్రీ ప్రసాద్ లో మునుపటి స్పీడ్ తగ్గినప్పటికీ స్టార్ ఛాన్సులు కొడుతూనే ఉన్నాడు. మిక్కీ జె మేయర్ కు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్ రాజా, హరీష్ జైరాజ్ లాంటి పాత కాపులందరూ మళ్ళీ ట్రాక్ లోకి వస్తున్నారు. సో రెండు సినిమాల వండర్ గా రవి బస్రూర్ మిగిలిపోకూడదంటే తన ప్రత్యేకత నిలబెట్టుకోవాలి. లేదంటే ఇంత కాంపిటీషన్ లో నెగ్గుకురావడం కష్టం.
This post was last modified on August 21, 2023 12:32 am
వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…
రాష్ట్రంలోని కూటమి సర్కారు ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులను మాత్రమే భర్తీ చేస్తోంది. అయితే.. ఈ క్రమంలో సీఎం విచక్షణ…
"రాజకీయాలు కుళ్లిపోయాయి. ఆయన మా తండ్రి అని చెప్పుకొనేందుకు సిగ్గుపడుతున్నా" ఓ 15 ఏళ్ల కిందట కర్ణాటకలో జరిగిన రాజకీయం…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చుట్టూ బీజేపీకి చెందిన హేమాహేమీలు ఉంటారు. దాదాపుగా వారంతా ఉత్తరాదికి చెందిన వారే. దక్షిణాదికి…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…