సినిమాల బిజినెస్ జరిగేది ప్రధానంగా హీరోల ఇమేజ్, మార్కెట్‌ను అనుసరించే. వాళ్ల చివరి సినిమాలు సాధించిన వసూళ్లను అనుసరించే కొత్త చిత్రాలకు రేట్లు పలుకుతుంటాయి. వరుస ఫెయిల్యూర్లలో ఉన్న హీరో కొత్త చిత్రానికి బిజినెస్ పరంగా ఇబ్బందులు తప్పవు. అందులోనూ చివరి సినిమా ఇండస్ట్రీ చరిత్రలోే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచినపుడు నెగెటివ్ ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది.
కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఈ విషయంలో మినహాయింపుగానే కనిపిస్తున్నాడు. అతను చివరగా ‘గీత గోవిందం’ మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు చూశాడు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్‌తో పాటు ‘లైగర్’ ఎంతగా నిరాశ పరిచాయో తెలిసిందే. ముఖ్యంగా ‘లైగర్’ అయితే టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక నష్టాలు మిగిల్చిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ప్రభావం విజయ్ కెరీర్ మీద బాగానే పడుతుందని అనుకున్నారు.
కానీ విజయ్ కొత్త చిత్రం ‘ఖుషి’కి అంచనాలకు మించే బిజినెస్ జరిగింది. ‘లైగర్’ తర్వాత విజయ్ కెరీర్లో అత్యధిక బిజినెస్ చేసిన చిత్రం ఇదే. ‘ఖుషి’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు రూ.52 కోట్లు పలకడం విశేషం. ఆంధ్రా ఏరియాకు రూ.20 కోట్లు, సీడెడ్లో రూ.6 కోట్లు, నైజాంలో రూ.15 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల ద్వారా రూ.7.5 కోట్లు, ఇండియాలోని మిగతా ప్రాంతాల నుంచి రూ.3.5 కోట్లు తెచ్చిపెట్టింది.
మొత్తంగా థియేట్రికల్ బిజినెస్ రూ.50 కోట్ల మార్కును దాటేసింది. సినిమాకు డీసెంట్ బజ్ ఉండటంతో భారీ ఓపెనింగ్స్ ఖాయం అనిపిస్తోంది. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా రికవరీ కష్టమేమీ కాదని భావిస్తున్నారు. పాటలు.. ప్రోమోలు.. ఇప్పటిదాకా చేసిన ప్రమోషన్లతో సినిమాకు మంచి బజ్ తీసుకురావడంలో చిత్ర బృందం విజయవంతం అయింది. రిలీజ్ ముంగిట విజయ్ మరింతగా ప్రమోషన్లను హోరెత్తించబోతున్నాడు.
This post was last modified on August 20, 2023 9:37 pm
అంతా అనుకున్నట్లు జరిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మస్కు అనుకున్న ఆ చిత్రం…
నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…
ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…