చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం పాత సామెత. ఇప్పుడంతా రివర్స్. తెలుగులో టోటల్ వాషౌట్ అయిపోయి ఏదో ముందస్తు అగ్రిమెంట్ల వల్ల, ఇంకొక్క వారం ఎంతో కొంత రాకపోతుందా అనే ఆశ వల్ల భోళా శంకర్ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొన ఊపిరితో ప్రధాన కేంద్రాల్లో ఆడుతోంది. చిరంజీవి కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా సుమారు యాభై కోట్లకు పైగా నష్టంతో దారుణమైన ఫలితాన్ని అందుకున్న తేడా కొట్టిన ఈ మాస్ ఎంటర్ టైనర్ ని ఆగస్ట్ 25న హిందీలో రిలీజ్ చేయబోతున్నారు. చిరుకి హిందీ సీనియర్ హీరో జాకీ శ్రోఫ్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే
దీనికేమాత్రం బజ్ లేదు. అసలెందుకు డబ్ చేశారనే అనుమానం మెగా ఫ్యాన్స్ ని వెంటాడుతోంది. ముందే చేసుకున్న ఒప్పందం వల్ల రిలీజ్ చేయడం తప్పించి ఏదో ట్రోలింగ్ కి అవకాశం ఇవ్వడం కోసం కాదని నిర్మాణ వర్గాలు అంటున్నాయి. సరే ఏదైతేనేం విడుదల చేస్తున్నప్పుడు ప్రమోషన్లు అవసరమే. అయితే మేకర్స్ తెలివిగా రామ్ చరణ్ పేరుని వాడేసుకుంటున్నారు. అవుట్ డోర్ లో వాడే స్టాండీస్ మీద అల్లూరి సీతారామరాజు ఫోటో పెట్టి దాని పైన ఫాదర్ అఫ్ ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్ అని ప్రత్యేకంగా హైలెట్ చేసి మరీ పబ్లిసిటీలో హైలైట్ చేస్తున్నారు. ఈ ఐడియా వెరైటీగా ఉంది కదూ.
అసలే ఆ రోజు విపరీతమైన పోటీ ఉంది. దుల్కర్ సల్మాన్ కింగ్ అఫ్ కొత్త, ఆయుష్మాన్ ఖురానా డ్రీం గర్ల్ 2లు మంచి అంచనాలతో థియేటర్లో అడుగు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రొటీన్ మాస్ కంటెంట్ ఉన్న భోళా శంకర్ ని అక్కడి ఆడియన్స్ కనీసం పట్టించుకున్నా గొప్పే. ఇలా చేయడం వెనుక మరో కారణం కూడా వినిపిస్తోంది. భారీ రేటు ఇచ్చి ఓటిటి హక్కులు తీసుకున్న నెట్ ఫ్లిక్స్ అగ్రిమెంట్ లో భాగంగా హిందీ థియేట్రికల్ రిలీజ్ అడిగిందట. బయ్యర్ కూడా దొరకడంతో ముందే మాట్లాడుకున్నారు. కానీ తలచినదే జరిగిందా దైవం ఎందులకు తరహాలో మొత్తం రివర్స్ అయ్యింది.
This post was last modified on August 20, 2023 9:36 pm
అంతా అనుకున్నట్లు జరిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మస్కు అనుకున్న ఆ చిత్రం…
నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన తండేల్ థియేటర్లకు వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్…
ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే.…
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…