Movie News

కల్ట్ దర్శకుడి జిలేబి ఎలా ఉందంటే

తెలుగు సినిమా వినోదంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాల్లో ఖచ్చితంగా గుర్తొచ్చేవి నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లేశ్వరి. వీటి దర్శకుడిగా కె విజయభాస్కర్ కు చాలా పేరుండేది. సక్సెస్ లో రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సింహ భాగం ఇవ్వాల్సిందే కానీ పేపర్ మీద కంటెంట్ ని అంతే అందంగా తెరకెక్కించిన డైరెక్టర్ ని తక్కువ చేయలేం. ఈ ఇద్దరి కాంబోకి జై చిరంజీవతో బ్రేక్ పడింది. విజయభాస్కర్ చివరి చిత్రం 2013లో వచ్చిన మసాలా. పదేళ్ల గ్యాప్ తర్వాత కొడుకు శ్రీకమల్ ని హీరోగా పరిచయం చేస్తూ జిలేబిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

జిలేబి(శివాని రాజశేఖర్) అనే అమ్మాయి కొన్ని అనూహ్య సంఘటనల వల్ల బాయ్స్ హాస్టల్ లో రహస్యంగా తలదాచుకునే పరిస్థితి తలెత్తుంది. అప్పటికే కమల్(శ్రీకమల్)తో ఉన్న పరిచయమే ఈ సంకట స్థితికి కారణం అవుతుంది. ఆమె ఉన్నట్టు మరో ముగ్గురు కుర్రాళ్లకు తెలిసిపోతుంది. స్థానిక ఎమ్మెల్యే అయిన జిలేబి తండ్రి(మురళీశర్మ) కూతుర్ని వెతికే క్రమంలో జరిగే పరిణామాలు, హాస్టల్ వార్డెన్ ధైర్యం (రాజేంద్రప్రసాద్) ఈ జంటకు ఎలా సహాయం చేశాడనే ప్రశ్నలకు సమాధానాలే జిలేబి స్టోరీ. పాయింట్ కొంచెం వెరైటీగా ఉన్నా ట్రీట్మెంట్ మాత్రం పాత పద్దతిలోనే సాగుతుంది.

పాత్రల పరిచయాలు, అసలు ట్విస్టు తాలూకు ఎస్టాబ్లిష్ మెంట్, హాస్టల్ అల్లరి ఇవన్నీ రెగ్యులర్ గా ఉండటంతో వాటి నుంచి ఆశించిన హాస్యాన్ని విజయభాస్కర్ రాబట్టలేకపోయారు. సీనియర్ ఆర్టిస్టులు అండగా ఉండటం కొంత వరకు ప్లస్ అయ్యింది. సెకండ్ హాఫ్ ఓ మోస్తరుగా పర్వాలేదనిపించినా మొత్తంగా చూసుకుంటే జిలేబిలో చక్కర శాతం తగ్గిపోయి పాకం తగ్గిన పిండిలా మారిపోయింది. మణిశర్మ సంగీతంతో సహా టెక్నికల్ టీమ్ తమ వంతుగా క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నించారు కానీ ఆశించిన ఫలితం రాలేదు. బలమైన కంబ్యాక్ ఇస్తారనుకున్న దర్శకులు ఇలా ఒక మాములు సినిమా ఇవ్వడం విచిత్రమే.

This post was last modified on August 20, 2023 11:35 am

Share

Recent Posts

249 కొట్టినా గెలవలేని టీం ఇండియా

టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…

5 hours ago

బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చడం లేదంటే

కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…

6 hours ago

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న…

7 hours ago

తెలంగాణ హీరో రాయలసీమ యాస పేలిందా

ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…

8 hours ago

కొత్త ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి

తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలే హ‌వా చూపించాయి.…

8 hours ago

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

9 hours ago