భాషా భేదం లేకుండా సినిమాలను ఆదరించడంలో తెలుగు వారి తర్వాతే ఎవరైనా. కేవలం పర భాషా చిత్రాలను ఆదరించడమే కాదు.. అక్కడి హీరోలను కూడా నెత్తిన పెట్టుకుంటారు. మనోళ్ల ప్రేమ ఎలా ఉంటుందో సూర్య సన్నాఫ్ కృష్ణన్, రఘువరన్ బీటెక్ లాంటి పాత అనువాద చిత్రాల రీ రిలీజ్ టైంలో రెస్పాన్స్ చూస్తే అర్థమైపోతుంది. మన వాళ్లకు మలయాళ పరిశ్రమ నుంచి అత్యంత నచ్చిన హీరో అంటే దుల్కర్ సల్మాన్ అనే చెప్పాలి.
మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి సీనియర్లకూ ఇక్కడ ఆదరణ ఉంది కానీ.. దుల్కర్ వారిని మించిపోయాడు. మహానటి, సీతారామం సినిమాలతో అతను అంతగా కట్టి పడేశాడు తెలుగు ప్రేక్షకులను. దాదాపుగా తెలుగులో మిడ్ రేంజ్ యంగ్ హీరోలతో సమానంగా అతడికి ఇక్కడ అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఐతే దుల్కర్ తెలుగులో చేస్తున్న సినిమాలకు ఆదరణ బాగానే ఉంటోంది కానీ.. ఇప్పటిదాకా అతడి మలయాళ అనువాద వెర్షన్లను మనవాళ్లు పట్టించుకున్నది లేదు.
ఐతే వచ్చే శుక్రవారం ‘కింగ్ ఆఫ్ కోతా’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీన్ని ముందు నుంచి పాన్ ఇండియా సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు. మలయాళంలో ‘కింగ్ ఆఫ్ కోతా’కు బంపర్ క్రేజ్ ఉంది. తమిళంలో కూడా పర్వాలేదు. కానీ తెలుగులో ఈ సినిమాకు ఏమాత్రం ఆదరణ ఉంటుందనే విషయంలోనే సందేహాలున్నాయి. దుల్కర్‌ను ఇష్టపడేవారు ఇక్కడ పెద్ద ఎత్తునే ఉన్నప్పటికీ.. అతడి మలయాళ అనువాద చిత్రం చూడటానికి థియేటర్లకు వెళ్తారా అన్నది ప్రశ్నార్థకమే.
ఐతే దుల్కర్ ఈ సినిమాకు తెలుగులో ఒక ఈవెంట్ చేయడమే కాక.. మీడియా ఇంటర్వ్యూలు కూడా బాగానే ఇస్తున్నాడు. ఈ సినిమా ప్రోమోలు కూడా బాగానే ఉన్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమాలాగే కనిపిస్తోంది. మరి దుల్కర్ తెలుగులో చేసిన సినిమాలతో ఎంతగానో అలరించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మన ఆడియన్స్ అతడి మలయాళ అనువాదాన్ని థియేటర్లకు వెళ్లి చూసి తనను ప్రోత్సహిస్తారేమో చూడాలి.
This post was last modified on August 19, 2023 7:17 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…