హీరోలు తమ కోస్టార్స్‌ను పెళ్లాడటం టాలీవుడ్లో కొత్తేమీ కాదు. అక్కినేని నాగార్జున-అమల దగ్గర్నుంచి ఈ కోవలో ఎన్నో జంటలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి చేరుతున్న జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలదే. వీరి ప్రేమాయణం గురించి కొన్నేళ్లుగా రూమర్లు వస్తున్నప్పటికీ.. అవి నిజం అనిపించేలా చిన్న ఆధారం కూడా బయటికి రాలేదు.
తమ ప్రేమాయణాన్ని సాధ్యమైనంత వరకు గుట్టుగా ఉంచడంలో ఈ జంట విజయవంతమైంది. నేరుగా ఎంగేజ్మెంట్ న్యూస్‌తో ఈ జోడీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంగేజ్మెంట్ తర్వాత కూడా వీళ్లిద్దరూ లో ప్రొఫైలే మెయింటైన్ చేస్తున్నారు. ఐతే తన కొత్త చిత్రం ‘గాండీవధారి అర్జున’ ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో వరుణ్ తన ప్రేమ, పెళ్లి గురించి కొంత ఓపెన్ అవుతున్నాడు. ఒక ఇంటర్వ్యూలో తమ ప్రేమ ఎలా మొదలైందో.. పెళ్లి ఎప్పుడు ఉంటుందో అతను వివరించాడు.
‘‘నేను ప్రైవేట్ పర్సన్‌ని. వ్యక్తిగత విషయాలు బయటి వాళ్లకు తెలియకూడదు అనుకుంటాను. అందుకే సోషల్ మీడియాలో నా వ్యక్తిగత విషయాలేవీ పంచుకోను. అందుకే లావణ్యతో నా రిలేషన్‌షిప్ గురించి ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు. నిశ్చితార్థం అయినపుడు మాత్రమే అధికారికంగా ఫొటోలు రిలీజ్ చేశాను. లావణ్యతో ‘మిస్టర్’ టైంలో బాగా పరిచయం ఏర్పడింది. అప్పటికి తను నాకు మంచి ఫ్రెండ్ అయింది. మా ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉంటాయి. జీవిత భాగస్వామి ముందు మనకు మంచి ఫ్రెండ్‌గా ఉండాలి అనుకుంటాను.
లావణ్య అలాంటి వ్యక్తే. మేమిద్దరం వ్యక్తిగత, వృత్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడుకోగలం. ‘అంతరిక్షం’ సినిమా కంటే మేమిద్దరం రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి జీవితాన్ని పంచుకోగలం అనుకున్నాక పెద్దవాళ్లకు విషయం చెప్పి పెళ్లికి ఒప్పించాం. ఈ ఏడాది చివర్లో మా పెళ్లి ఉంటుంది. డెస్టినేషన్ వెడ్డింగే ఉండొచ్చు. హైదరాబాద్ నాకు చాలా ఇష్టమైన సిటీ అయినప్పటికీ.. పెళ్లి వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ప్రశాంతంగా సాగాలంటే డెస్టినేషన్ వెడ్డింగే కరెక్ట్ అనుకుంటున్నాం. అందుకే రెండు మూడు ప్రదేశాలను పరిశీలిస్తున్నాం’’ అని వరుణ్ తెలిపాడు.
This post was last modified on August 19, 2023 4:29 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…