Movie News

మహేష్ గ్రీన్ సిగ్నల్ కోసం టీం వెయిటింగ్

మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూడో సినిమాగా వస్తున్న ‘గుంటూరు కారం’ సాంగ్ అప్ డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ , టీజర్ వచ్చేశాయి. ఇక మొదటి సాంగ్ రావడమే ఆలస్యం. అయితే తమన్ తాజాగా రెండు సాంగ్స్ రెడీ చేసి ఇచ్చాడట. అందులో ఓ సాంగ్ కి ప్రోమో కూడా రెడీ చేశారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఆ సాంగ్ ప్రోమోను మహేష్ పుట్టిన రోజు నాడు రిలీజ్ అనుకున్నారు.

ఆగస్ట్ 15 లేదా అంత కంటే ముందే లిరికల్ సాంగ్ రిలీజ్ అనుకొని ప్లాన్ చేసుకున్నారు. కానీ మహేష్ నుండి ఈ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆ ప్లాన్ మార్చి బర్త్ డే పోస్టర్స్ మాత్రమే వదిలారు.  నిజానికి మహేష్ కోసం స్పెషల్ కేర్ తీసుకొని తమన్ రీసెంట్ గా కంపోజ్ చేసిన సాంగ్స్ బాగా వచ్చాయట. మొదటి సాంగ్ ప్రోమో చూసి ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీలవ్వడం ఖాయమని ఇండస్ట్రీలో గట్టి టాక్ వినబడుతుంది. కానీ మహేష్ ఓకే అని చెప్పనందుకే సాంగ్ ఇంకా లేట్ అవుతుందని తెలుస్తుంది.

దీనికి రీజన్ మహేష్ కి తమన్ మధ్య ఏదో ఇగో క్లాష్ అని అంటున్నారు. తమన్ వర్క్ పట్ల మహేష్ కాస్త డిసప్పా యింట్ గా ఉన్నాడని ఇనసైడ్ న్యూస్. దీంతో త్రివిక్రమ్ వీరిద్దరి మధ్య నలిగిపోతున్నారని టాక్. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ మహేష్ గ్రీన్ సిగ్నల్ కోసమే టీం వెయిట్ చేస్తుందనేది మాత్రం నిజం. సూపర్ స్టార్ ఓకే  అని చెప్తే వచ్చే నెల వినాయకచవితికి సాంగ్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. 

ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా ఘాట్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎట్టి పరిస్తితుల్లో థియేటర్స్ లోకి తీసుకొచ్చేందుకు త్రివిక్రమ్ అండ్ టీం కష్టపడుతున్నారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మరో మూడు నెలలో టాకీ కంప్లీట్ చేసి డిసెంబర్ లోపు టోటల్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంది.

This post was last modified on August 19, 2023 1:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ముర‌ళీమోహ‌న్ అంత‌రంగం.. అయితే, అదే పెద్ద స‌మ‌స్య‌!

ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత‌, వ్యాపార వేత్త ముర‌ళీమోహ‌న్‌.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…

2 hours ago

ఆ రోజుల్లో… శ్రీవారు క‌నిపించేది సెక‌నంటే సెక‌నే!!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం అంటే.. ఓ 2 నిమిషాలు ల‌భిస్తుంద‌ని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్న‌గారు ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా…

3 hours ago

బ్రేకింగ్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…

4 hours ago

అప్ప‌టి వ‌ర‌కు చెప్పులు వేసుకోను: అన్నామ‌లై

రాజ‌కీయ నేత‌లు స‌వాళ్లు చేయ‌డం తెలుసు. అదే విధంగా ప్ర‌తిజ్ఞ‌లు చేయ‌డం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…

6 hours ago

చరణ్ కి పోటీగా సోనూసూద్ – చిరంజీవి రియాక్షన్

గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…

6 hours ago