ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు ఒకప్పటి డబ్బింగ్ లవ్ స్టోరీస్ కూడా తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ డబ్బింగ్ మూవీస్ 3 , ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ , ‘రఘువరన్ బీటెక్’ లాంటి సినిమాలు రిలీజై మంచి వసూళ్లు అందించాయి. ఇప్పుడు ఇదే బాటలో మరో కల్ట్ లవ్ స్టోరీ మళ్ళీ థియేటర్స్ లోకి వస్తోంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కొడుకు రవి కిషన్ , సోనియా జంటగా కొన్నేళ్ళ క్రితం వచ్చి సూపర్ హిట్టయిన 7 /G బృందావన్ కాలనీ రీ రిలీజ్ కి రెడీ అవుతుంది.
తాజాగా ఈ సినిమా రీల్ తీసుకొని 4 k కన్వర్షన్ పనులు మొదలు పెట్టారు. డాల్బీ సౌండ్ తో సినిమాను క్వాలిటీ మిస్ అవ్వకుండా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు వెనుక కసరత్తు జరుగుతుంది. యూత్ కి ఫేవరెట్ మూవీ కావడంతో ఈ సినిమా రీ రిలీజ్ కోసం తెలుగు ఆడియన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకూ డేట్ తెలియక ఎనౌన్స్ మెంట్ కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు తాజాగా రిలీజ్ డేట్ అప్ డేట్ అందింది. సెప్టెంబర్ 22 న 7/G బృందావన్ కాలనీ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
అయితే వచ్చే నెల సెప్టెంబర్ లో రామ్ ‘స్కంద’ , ప్రభాస్ ‘సలార్’ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. స్కంద సెప్టెంబర్ 15 న రిలీజ్ అవుతుండగా , ప్రభాస్ సలార్ భారీ అంచనాలతో సెప్టెంబర్ 28 న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ రెండు సినిమాల మధ్య బృందావన్ కాలనీ రీ రిలీజ్ గా వస్తుంది. మరి రామ్ సినిమా తర్వాత సలార్ కంటే ముందు వారం ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో ? రీ రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్స్ ను దాటేస్తుందా ? చూడాలి.
This post was last modified on August 19, 2023 1:29 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ మరణశిక్ష అమలుపై తన కఠినమైన వైఖరిని వ్యక్తం చేశారు.…
మాములుగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు వారాల తర్వాత బాగా నెమ్మదించిపోతుంది. మొదటి పది…
పెద్ద అంచనాలతో బాలీవుడ్ మూవీ బేబీ జాన్ రిలీజయ్యింది. విజయ్ బ్లాక్ బస్టర్ తెరీ రీమేక్ గా అట్లీ నిర్మాణంలో…