కంటెంట్ డ్రివెన్ సినిమా పేరుతో కేవలం నగర, పట్టణ యువతను, కుటుంబాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీస్తున్న బాలీవుడ్ నిర్మాతలకు గదర్ 2 కొత్త పాఠం నేర్పిస్తోంది. కేవలం డెబ్భై కోట్ల బడ్జెట్ తో రూపొంది వారం తిరగడం ఆలస్యం రెండు వందల యాభై కోట్ల వసూళ్లకు దగ్గరగా వెళ్లడం చూసి తలలు పండిన ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సెప్టెంబర్ 7న షారుఖ్ ఖాన్ జవాన్ వచ్చేవరకు దీనికి అడ్డుకట్ట పడదని అంచనా వేస్తున్నారు. సోలో హీరోగా ఎప్పుడో మార్కెట్ కోల్పోయిన సన్నీ డియోల్ అరవై రెండేళ్ల వయసులో రికార్డులు నమోదు చేయడం విశేషం.
ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మాసే ఎక్కడైనా ఎప్పటికైనా మహారాజ పోషకులు. ఒక మూవీ వందల కోట్ల కలెక్షన్లు కళ్లజూడాలంటే క్లాస్ ఆడియన్స్ తో జరగని పని. అన్ని భాషలకు ఇది వర్తిస్తుంది. మొన్నొచ్చిన జైలర్ నుంచి జనవరిలో రిలీజైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల దాకా అన్నీ కమర్షియల్ చిత్రాలే. పఠాన్ సైతం మాస్ ని మెప్పించే యాక్షన్ కంటెంట్ తో రూపొందిందే. బిసి సెంటర్ల జనాన్ని మెప్పిస్తే ఎలాంటి ఓటిటిలైనా దిగదుడుపే అని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. నచ్చితే నెత్తినబెట్టుకునే వర్గం తాలూకు ప్రభావమది
చాలా కాలం తర్వాత ఉత్తరాది థియేటర్లలో పండగ వాతావరణం కనిపిస్తోందని బయ్యర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీక్ డేస్ లోనూ జోరు కొనసాగడం చూసి ఇలా ఉంటే థియేటర్లను అమ్మేసుకోవాలనో లేదా ఫంక్షన్ హాళ్లుగా మార్చాలనో అనిపించదని అంటున్నారు. ట్రాక్టర్లు, లారీలు వేసుకొచ్చి మరీ సినిమాలకు రావడం గదర్ 2 విషయంలో బలంగా కనిపిస్తోంది. ఇకనైనా కార్పొరేట్ ప్రపంచానికి దూరంగా పది రూపాయలు టీ తాగే సగటు సామాన్యుడికి ఎలాంటి సినిమా ఇవ్వాలో అలాంటివి రాసుకోమని మూవీ లవర్స్ కోరుతున్నారు. ట్రెండ్ కూడా దాన్నే సూచిస్తోంది మరి.
This post was last modified on August 18, 2023 4:51 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…