Movie News

కొత్తవి పట్టించుకోరు – పాతవి క్యూ కడతారు

రేపు శుక్రవారం కొత్త సినిమాలు కౌంట్ పరంగా గట్టిగానే ఉన్నాయి కానీ బజ్ విషయంలో మాత్రం అన్నీ ఒకే స్థాయిలో లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నాయి. ప్రమోషన్ల పరంగా అందరూ కష్టపడుతున్నా జనంలో ఆసక్తి రేపడం కష్టమవుతోంది. సంతోష్ శోభన్ ‘ప్రేమ్ కుమార్’ పెద్దగా హడావిడి చేయకుండా సైలెంట్ గా రంగంలోకి దిగుతోంది. లక్కు తప్ప అన్నీ ఉన్న ఈ కుర్ర హీరోకి ఇది బ్రేక్ ఇవ్వకపోతే ఆపై కష్టమే. బిగ్ బాస్ ఫేమ్ సుహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఏదో డిఫరెంట్ గా ట్రై చేసింది. నిన్న ప్రత్యేకంగా గర్భిణులకు షో వేసి మరీ వాళ్ళ ఎమోషనల్ ఫీడ్ బ్యాక్ ని పబ్లిసిటీ రూపంలో వాడుతున్నారు.

నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు లాంటి క్రేజీ ఎంటర్ టైనర్స్ ఇచ్చిన దర్శకుడు విజయ్ భాస్కర్ తన కొడుకుని పరిచయం చేస్తూ తీసిన ‘జిలేబి’ టైటిల్ పరంగా స్వీట్ గా ఉన్నా అంచనాల పరంగా చప్పగా ఉంది. తమిళ డబ్బింగ్ ‘పిజ్జా 3 ది మమ్మీ’ ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప కనీసం మార్నింగ్ షోలకు జనం ఉండరు. కమెడియన్ సంతానం నటించిన మరో అనువాద చిత్రం ‘డిడి భూత్ బంగ్లా’ మాస్ హారర్ ప్రియులను టార్గెట్ గా పెట్టుకుంది. ఇవి కాకుండా మరో మూడు చిన్న సినిమాలున్నాయి కానీ వీటికి చాలా చోట్ల షో దొరకడమే కష్టమైనా ఏదోలా కిందామీద పడి రిలీజ్ అవుతున్నాయి.

వీటి పరిస్థితి ఇలా ఉంటే రీ రిలీజులు రఘువరన్ బిటెక్, యోగిలకు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. సింగల్ షోలు పడిన సెంటర్లలో హౌస్ ఫుల్స్ ఖాయమే. టికెట్ కౌంటర్ల ద్వారా అమ్మకాలు బాగుంటాయని బయ్యర్లు చెబుతున్నారు. ఆది పినిశెట్టికి మొదటి బ్రేక్ ఇచ్చిన ‘మృగం’ని సైతం రేపే మరోసారి తీసుకొస్తున్నారు. 2007లో విడుదలైనప్పుడు మాస్ సెంటర్స్ ని ఊపేసిన మృగం తర్వాత హోమ్ వీడియోలో ఎన్నో సంచలనాలు రేపింది. ఆ నమ్మకంతోనే నిర్మాతలు సాహసం చేస్తున్నారు. చూస్తుంటే కొత్త సినిమాలను పాతవి ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

This post was last modified on August 18, 2023 1:24 am

Share

Recent Posts

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

6 minutes ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

2 hours ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

2 hours ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

3 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

7 hours ago