ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత నిరాశతో ఉన్న అభిమానులంటే అక్కినేని హీరోలను ఇష్టపడే వారే. ఈ ఫ్యామిలీ హీరోలందరూ వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా ఏఎన్నార్ తర్వాత చాలా ఏళ్ల పాటు అక్కినేని లెగసీని ముందుకు తీసుకెళ్లిన నాగార్జున.. కొన్నేళ్లుగా దారుణమైన ఫలితాలు అందుకుంటున్నారు. గత ఏడాది దసరాకు వచ్చిన నాగ్ మూవీ ది ఘోస్ట్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే.
దీంతో నాగ్ తన తర్వాతి సినిమా విషయంలో తర్జన భర్జనలు పడుతున్నాడు. రైటర్ ప్రసన్నకుమార్ దర్శకత్వంలో చేయాలనుకున్న సినిమా కూడా పక్కకు వెళ్లిపోయింది. ఏడాదిగా షూటింగ్స్ ఏమీ లేక ఖాళీగా ఉన్నాడు కింగ్. ఆయన కొత్త సినిమా ఏదో.. అదెప్పుడు మొదలవుతుందో తెలియని అయోమయంలో ఉన్నారు ఫ్యాన్స్.
ఈ నెల 29న నాగ్ పుట్టిన రోజు సందర్భంగా కూడా ఆయన కొత్త సినిమా గురించి కబురు వినిపించే సంకేతాలేమీ కనిపించడం లేదు. కానీ ఈ విషయం నిరాశ కలిగించినా.. నాగ్ అభిమానుల్లో ఉత్సాహం నింపే అప్‌డేట్ బయటికి వచ్చింది. కింగ్ కెరీర్లో మరపురాని చిత్రాల్లో ఒకటైన మన్మథుడు పుట్టిన రోజు కానుకగా రీ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థే వెల్లడించింది. రీ రిలీజ్ కూడా ఆ సంస్థ చేతుల మీదుగానే జరగనుంది. ఏడాదిగా టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటిదాకా నాగ్ ఫ్యాన్సే ఈ ట్రెండులో పార్టిసిపేట్ చేయలేదు. ఎట్టకేలకు అక్కినేని అభిమానులు కూడా ఇందులో భాగం అవుతున్నారు. మన్మథుడు పేరెత్తగానే నాగ్ అభిమానుల్లో పులకింత కలుగుతుంది. ఇందులో మాస్ హీరోయిజం ఉండదు కానీ.. అభిమానులను అలరించే మూమెంట్స్‌కైతే లోటు లేదు. మన్మథుడులో ఎంటర్టైన్మెంట్, నాగ్ ఛార్మ్ వేరే లెవెల్లో ఉంటాయి. నాగ్ ఫ్యాన్స్ అనే కాక సామాన్య ప్రేక్షకులు కూడా థియేటర్లలో బాగా ఎంజాయ్ చేయగల సినిమా ఇది.
This post was last modified on August 17, 2023 11:33 am
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…