ఒకప్పుడు తెలుగులో తమిళ అనువాద చిత్రాల హవా మామూలుగా ఉండేది కాదు. 2000 తర్వాత తెలుగు సినిమాల క్వాలిటీ పడిపోగా.. చంద్రముఖి, గజిని, అపరిచితుడు, శివపుత్రుడు, శివాజి, రంగం, రోబో లాంటి అనువాద చిత్రాలు ఇక్కడ అవసూళ్ల మోత మోగించాయి. తమిళ అనువాదాల దెబ్బకు తెలుగు సినిమాల వసూళ్ల మీద ప్రభావం పడటంతో డబ్బింగ్ సినిమాలపై ఆంక్షలు విధించాలన్న చర్చ కూడా టాలీవుడ్లో నడిచింది.
కానీ గత దశాబ్ద కాలంలో వేగంగా పరిస్థితులు మారిపోయాయి. తెలుగు సినిమాల క్వాలిటీ, మార్కెట్ అసాధారణ స్థాయిలో పెరిగింది. అదే సమయంలో తమిళ చిత్రాల నాణ్యత బాగా దెబ్బ తిని.. అనువాద చిత్రాలకు ఇక్కడ డిమాండ్ బాగా తగ్గిపోయింది. కానీ ఈ మధ్య మళ్లీ తమిళ అనువాదాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. గత ఏడాది వ్యవధిలో ఏడాది విక్రమ్, వారసుడు, విడుదల, బిచ్చగాడు-2 లాంటి చిత్రాలకు తెలుగులో మంచి వసూళ్లే వచ్చాయి. ఇప్పుడు ‘జైలర్’ టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది.
తమిళ అనువాదాలకు తెలుగులో మళ్లీ మంచి డిమాండ్ ఏర్పడ్డ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తర్వాత రాబోయే అనువాద చిత్రాలకు ఇది బాగా ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దసరాకు రాబోయే విజయ్ సినిమా ‘లియో’ తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి విజయ్ మార్కెట్ తెలుగులో పెరుగుతూ వస్తోంది. పైగా ఇది లోకేష్ కనకరాజ్ సినిమా. అతడికీ ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్‌కి తోడు అర్జున్, సంజయ్ దత్, త్రిష లాంటి కాస్టింగ్ ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ పెంచుతోంది.
దసరా కానుకగా రిలీజవుతున్న ఈ చిత్రానికి టాక్ బాగుంటే విజయ్‌కి తెలుగులో అతి పెద్ద హిట్‌గా నిలవడం ఖాయం. ఇక తెలుగులో బంపర్ క్రేజ్ తెచ్చుకున్న మరో అనువాద చిత్రం ‘కంగువా’. సూర్యకు మామూలుగానే తెలుగులో మంచి మార్కెట్ ఉంది. కానీ గత కొన్నేళ్లలో సరైన సినిమాలు చేయక వెనుకబడ్డాడు. కానీ ‘కంగువా’ టీజర్ చూశాక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో ఒక పెద్ద సినిమా రేంజిలో ఇది రిలీజ్ కాబోతోంది. ఈ రెంటికీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.
This post was last modified on August 16, 2023 7:12 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…