ఆరెక్స్ 100తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్టు కోసం ఎదురు చూస్తున్న హీరో కార్తికేయ కొత్త సినిమా బెదురులంక 2012. షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ సరైన విడుదల తేదీ కోసం వాయిదాల మీద వాయిదాలు తిన్న ఈ విలేజ్ ఎంటర్ టైనర్ ఆగస్ట్ 25 విడుదలకు రెడీ అవుతోంది. క్లాక్స్ దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం సమకూర్చారు. డీజే టిల్లుతో వెలుగులోకి వచ్చి ఇటీవలే రూల్స్ రంజన్ చూసేయ్ చూసేయ్ పాటతో సోషల్ మీడియా జనాల్లో బాగా నానుతున్న నేహా శెట్టి ఇందులో హీరోయిన్. ఇందాకే ట్రైలర్ లాంఛనం పూర్తి చేశారు.
కథ మొత్తం చెప్పేశారు. 2012 సంవత్సరం. చుట్టూ నీళ్లు ఉండే ఒక ద్వీపం లాంటి ఊరు బెదురులంక. సిటీలో ఉంటూ సెలవుల కాలక్షేపానికి అక్కడికి వస్తాడు శివశంకర వరప్రసాద్(కార్తికేయ). చిన్ననాటి స్నేహితురాలి(నేహా శెట్టి)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. యుగాంతం వస్తుందని టీవీ ఛానల్స్ హోరెత్తించడంతో జనాలు భయపడిపోతారు. దీన్నే అదనుగా తీసుకున్న ఊరి పెద్ద మనుషులు వాళ్ళ అమాయకత్వాన్ని స్వార్థానికి వాడుకోవడానికి తెర తీస్తారు. మత పెద్దలు రంగంలోకి దిగి వ్యాపారం మొదలెడతారు. దీనికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకుంటాడు శివ. అదెలానేదే స్టోరీ
కాన్సెప్ట్ సీరియస్ గా అనిపిస్తున్నా ప్రెజెంటేషన్ మాత్రం వినోదాత్మకంగానే అనిపిస్తోంది. చివరి గంట యాక్షన్లు ఎమోషన్లు పెట్టేసి మిగిలిదంతా నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు దర్శకుడు క్లాక్స్. కార్తికేయకు అలవాటైన పాత్రే. నేహా శెట్టి గ్లామర్ డోస్ ఇందులోనూ వాడుకున్నారు. అజయ్ ఘోష్, గోపరాజు రమణ, ఎల్బి శ్రీరామ్, సత్య, ఆటో రాంప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి చిన్నా పెద్ద ఆర్టిస్టులందరినీ పెట్టేశారు. మణిశర్మ బిజిఎం, సాయి ప్రకాష్ – సన్నీ ఛాయాగ్రహణం బాగానే కుదిరాయి. వరుణ్ తేజ్ గాండీవధారి అర్జునతో పోటీ పడబోతున్న బెదురులంక ట్రైలర్ పరంగా పాజిటివ్ గానే ఉంది మరి
This post was last modified on August 16, 2023 4:59 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…