Movie News

భగవంత్ కేసరి మీద అర్థం లేని పుకారు

సోషల్ మీడియా కాలంలో నిజం నింపాదిగా నిద్ర లేచే లోపు అబద్దం సిటీ మొత్తం అయిదారు రౌండ్లు కొట్టేస్తుంది. ఇది సినిమా రంగానికి ఎక్కువ వర్తిస్తుంది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంత్ కేసరి అప్పుడెప్పుడో వచ్చిన హరికృష్ణ స్వామి స్ఫూర్తితో ఉంటుందని ఒక మీమ్ ఎవరో వదిలితే అది తక్కువ వ్యవధిలోనే వైరల్ అయిపోయింది. స్వామి ఒక కవల ఆడపిల్లల హత్యకు రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఆ టైంలోనే పెద్దగా ఆడలేదు. అలాంటిది తీసుకొచ్చి అనిల్ కొత్తగా వండుకుంటాడంటే అంతకంటే కామెడీ వేరొకటి ఉండదు.

క్రమంగా ఈ న్యూస్ ఎక్కువగా పాకిపోవడంతో స్వయంగా నిర్మాణ సంస్థే అలాంటిదేమి లేదని, ఇది పూర్తిగా కొత్త కథని ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. భగవంత్ కేసరిలో బాలయ్య మధ్య వయసు దాటిన ఏజ్డ్ లుక్ తో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇదే ప్రధాన హైలైట్ గా ఉంటుందని టీమ్ ముందు నుంచి ఊరిస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ అయితే మరి శ్రీలీలకు బాలకృష్ణకు పాత్ర పరంగా ఎలాంటి సంబంధం ఉంటుందనే దాని మీద పెద్దగా లీకులు లేవు. ఫ్రెండ్ కూతురనే టాక్ అయితే ఉంది ట్రైలర్ వచ్చాక ఏమైనా క్లారిటీ రావొచ్చు

అక్టోబర్ 19న విడుదల కాబోతున్న భగవంత్ కేసరికి భారీ బిజినెస్ ఆఫర్స్ జరుగుతున్నాయి. ఇంకా క్లోజ్ చేయలేదు కానీ ట్రేడ్ చెబుతున్న దాని ప్రకారం ఈసారి వీరసింహారెడ్డి కంటే ఎక్కువగా రేట్ పలుకుతుందని అంటున్నారు. హీరో డైరెక్టర్ కాంబినేషన్ క్రేజీగా ఉండటంతో ఆ మేరకు అంచనాలు ఓ రేంజ్ లో పెరుగుతున్నాయి. దసరా పండక్కు విజయ్ లియో,రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో పోటీ పడబోతున్న బాలయ్య ఈసారి సంక్రాంతి కాకపోయినా మాస్ పవర్ చూపిస్తాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. విలన్ గా అర్జున్ రామ్ పాల్ దీంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. 

This post was last modified on August 15, 2023 1:24 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

22 minutes ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

42 minutes ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

48 minutes ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

52 minutes ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

3 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

4 hours ago