అదేంటో కొన్ని కాకతాళీయ సంఘటనలు, లింకులు విచిత్రంగా అనిపించినా నమ్మేలా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. టాలీవుడ్ లోనే అత్యంత అదృష్టవంతుడయిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ తన ట్రాక్ రికార్డుని భద్రంగా కొనసాగించాడు. అయితే దీనికి క్రికెట్ కి సంబంధం ఏమనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. 2011లో శక్తి తీసినప్పుడు అదెంత కళాఖండంగా నిలబడిపోయిందో నిద్రలో అడిగినా తారక్ ఫ్యాన్స్ చెబుతారు. అదే ఏడాది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇండియాకు ఎంఎస్ ధోని వన్ డేలో వరల్డ్ కప్ తీసుకొచ్చి దేశమంతా సంబరాలు నింపాడు.
2013లో వెంకటేష్ షాడో వచ్చింది. ఇదింకో మాస్టర్ పీస్. దగ్గుబాటి అభిమానులే బాబోయ్ అనుకున్నారు. ఈ సంవత్సరమే మన టీమ్ ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని సగర్వంగా అందుకుంది. ఆ క్షణాలను క్రీడా ప్రేమికులు మర్చిపోలేరు. కట్ చేస్తే ఇప్పుడు 2013లో భోళా శంకర్ తో మెహర్ ఫలితాన్ని మళ్ళీ రిపీట్ చేశాడు. తీరా చూస్తే ఇంకో రెండు నెలల్లో మన దేశంలోనే వరల్డ్ కప్ జరుగుతోంది. అంటే ఈసారి కూడా హిస్టరీని రిపీట్ చేస్తూ మనం ప్రపంచ కప్ సాధించవచ్చనే ఒక విచిత్రమైన అనాలసిస్ ని క్రికెట్ లవర్స్ తీసుకొచ్చారు. వినడానికి నవ్వులాటగా ఉన్నా ఇదంతా నిజమేగా.
ఒకవేళ అన్నంత పనీ జరిగిపోతే మాత్రం షాక్ తప్పదు. వీటి సంగతి పక్కన పెడితే పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని మెహర్ రమేష్ చేతులారా వృథా చేసుకున్నాడు. దీని వల్ల ఇంకో హీరో ఛాన్స్ ఇవ్వడం కలే. కీర్తి సురేష్, తమన్నాలతో ప్లాన్ చేసుకున్న ఫిమేల్ ఓరియెంటెడ్ కథ కూడా అటకెక్కినట్టే. భోళా శంకర్ దెబ్బకు పైన చెప్పిన రెండు డిజాస్టర్ల రికార్డులు సేఫ్ అయ్యాయంటే మెగాస్టార్ కి ఎంత పెద్ద షాక్ కొట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఎలా ఉన్నా ఈ సెంటిమెంట్ నిజంగా పని చేస్తే మంచిదే. ఇంకో వరల్డ్ కప్ మన ఖాతాలో పడిపోతుంది.
This post was last modified on August 14, 2023 12:20 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…