రజనీకాంత్ డబ్బింగ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడటం చూసి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. 2.0 బాగానే ఆడినప్పటికీ కమర్షియల్ లెక్కలతో పాటు టాక్ పరంగా దానికి వచ్చిన మిశ్రమ స్పందన బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు. పెద్దన్న, కాల, కబాలి, పేట అన్నీ బోల్తా కొట్టినవే. రోబో తర్వాత సూపర్ స్టార్ రేంజ్ కి తగ్గ బొమ్మ ఏపీ తెలంగాణలో పడలేదని బాధ పడుతూ వచ్చిన తలైవా కోలీవుడ్ ఫ్యాన్స్ ఆకలి తీరేలా జైలర్ వీరవిహారం అన్ని చోట్లా కొనసాగుతోంది. నాలుగో రోజు ఆదివారం దాదాపు ఎక్కడా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది.
అగ్రిమెంట్ల ప్రకారం భోళా శంకర్ కు రిజర్వ్ చేసిన థియేటర్లను సైతం ఆగస్ట్ 15 నేషనల్ హాలిడేని దృష్టిలో ఉంచుకుని జైలర్ కే ఇచ్చేస్తున్న ఉదంతాలు ఆన్ లైన్ బుకింగ్ యాప్స్ లో కనిపిస్తున్నాయి . ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే చెప్పనక్కర్లేదు. ఒక డబ్బింగ్ మూవీ టికెట్ల కోసం ఈ స్థాయిలో డిమాండ్ చూడలేదని మల్టీప్లెక్సుల మేనేజర్లు అంటున్నారు. దీన్ని బట్టే జైలర్ ఏ స్థాయిలో ఎక్కేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇటు మాస్ సెంటర్స్ లోనూ ఇదే ఊచకోత కనిపిస్తోంది. కనీసం ఇంకో పది రోజులు ఇదే తరహాలో కలెక్షన్లు స్టడీగా ఉండటం ఖాయమే.
మొత్తం మూడు రోజులకు 13 కోట్ల 60 లక్షల షేర్ వసూలు చేసిన జైలర్ వీకెండ్ రాకముందే 12 కోట్ల బ్రేక్ ఈవెన్ దాటేసి బయ్యర్లను లాభాల దిశగా తీసుకెళ్తోంది. సన్ పిక్చర్స్ డీసెంట్ బిజినెస్ చేయడంలో ప్రాఫిట్ పర్సెంటెజ్ భారీగా ఉండబోతోంది. ఫుల్ రన్ లో పాతిక కోట్లకు పైగా షేర్ ని సులభంగా అందుకుంటుందని ఒకవేళ ముప్పై దాటినా ఎంత మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదని డిస్ట్రిబ్యూటర్ల టాక్. ఒకవైపు భోళా శంకర్ పరిస్థితి తీసికట్టుగా మారడంతో జైలర్ కు పడ్డ సండే ఓవర్ ఫ్లోస్ చిరు మూవీకి ఉపయోగపడ్డాయి. మొత్తానికి రజని ఇదయ్యా నీ విశ్వరూపం అనిపించుకునేలా వీరవిహారం కొనసాగిస్తున్నాడు.
This post was last modified on August 13, 2023 11:57 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…