ఇంకా విడుదలకు బోలెడు టైం ఉన్నప్పటికీ 2024 ఏప్రిల్ 5 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ కీలక దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఎలాంటి ఒత్తిడి లేకుండా పక్కా ప్లానింగ్ తో కొరటాల శివ, తారక్ ఎట్టి పరిస్థితుల్లో డేట్ మిస్ కాకూడదనే టార్గెట్ తో ఉన్నారు. అనిరుద్ రవిచందర్ పాటలు ఇవ్వడం, రీ రికార్డింగ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆలోగా యాక్షన్ ఎపిసోడ్స్, టాకీ పార్ట్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వాటి పోస్ట్ ప్రొడక్షన్ ని ఎలాంటి విఘ్నాలు లేకుండా జరిపించేస్తున్నారు.
ఇంత ముందుగా డేట్ ని బ్లాక్ చేసుకున్నప్పటికీ దేవర చుట్టూ పోటీ మేఘాలు కమ్ముకునేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో రూపొందుతున్న ఓజి ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఈ ఏడాది డిసెంబర్ లో రావొచ్చనే వార్త వట్టి పుకారేనని తేలిపోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నిర్మాత డివివి దానయ్య దీన్ని ఏప్రిల్ బరిలో దించాలని చూస్తున్నారట. అయితే ఎన్నికల వేడిలో పవన్ బిజీగా ఉంటాడు కాబట్టి ఆలోగా డబ్బింగ్ తో సహా మొత్తం ఫినిష్ చేసి రెడీగా ఉంచాలనే సూచన మేరకు షెడ్యూల్స్ ఆ రీతిలోనే ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. కాకపోతే తేదీ లాక్ చేయలేదు.
ఇక అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వస్తున్న పుష్ప 2 ది రూల్ సైతం సమ్మర్ నే అందులోనూ ఏప్రిల్ వైపే చూస్తోందట. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. నార్త్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి విడుదల తేదీ చెప్పమని ఒత్తిడి వస్తోంది. ఇది క్లారిటీ ఇస్తేనే భారీగా అడ్వాన్సులు వచ్చి పడతాయి. పైగా బాలీవుడ్ రిలీజులతో క్లాష్ లేకుండా జాగ్రత్తగా పడాలంటే ముందుగా కర్చీఫ్ వేసుకోవాల్సిందే. ఈ నెలాఖరున ప్రకటించబోయే నాగార్జున కొత్త మూవీ సైతం వేసవికే ఫిక్స్ చేస్తారట. సూర్య కంగువా, కమల్ హాసన్ ఇండియన్ 2 లు కూడా ఇదే నెల మీద కన్నేశాయి. చూడాలి ఏమేం జరగనుందో.
This post was last modified on August 13, 2023 2:34 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…