Movie News

10 నిముషాల పాత్రతో టాక్ ఆఫ్ ది టౌన్

జైలర్ విజయంలో స్పెషల్ క్యామియోలు ఎంత కీలక పాత్ర పోషించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శివ రాజ్ కుమార్ పంచెకట్టుతో కేవలం అయిదు నుంచి పది నిమిషాల మధ్యే కనిపించినా దాని ఇంపాక్ట్ మాత్రం ప్రేక్షకుల్లో బలంగా ఉందని సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే అర్థమైపోయింది. కర్ణాటక రాష్ట్రం మాండ్య పట్టణంలో ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసే పవర్ ఫుల్ నరసింహా క్యారెక్టర్ లో ఆయనకు చాలా తక్కువ డైలాగులు పెట్టారు . చివరి సీన్ లో కేవలం చుట్ట వెలిగించి థియేటర్లను షేక్ చేశారు. నిజానికి శాండల్ వుడ్ లో ఈయనో పెద్ద స్టార్. 

కానీ బయట రాష్ట్రాల వాళ్లకు తెలిసింది తక్కువ. అందుకే శివరాజ్ కుమార్ పాత సినిమాలు చూసేందుకు ఫ్యాన్స్  వెతుకులాట మొదలుపెట్టారు. వాళ్లకు కొన్ని షాకింగ్ సంగతులు తెలుస్తున్నాయి. ఇండియాలోనే అయిదు వందలసార్లకు పైగా రీ రిలీజ్ జరుపుకున్న ఓం హీరో ఈయనే. దీన్నే తెలుగులో రాజశేఖర్ తో రీమేక్ చేశారు. దర్శకుడిగా ఉపేంద్ర సత్తా ప్రపంచానికి తెలిసింది ఈ బ్లాక్ బస్టర్ తోనే. ప్రభాస్ ఏరికోరి ముచ్చటపడి నటించిన యోగి ఒరిజినల్ వెర్షన్ జోగి కథానాయకుడు శివరాజ్ కుమారే. ఇప్పటికీ దాని పేరు మీద రికార్డులు అక్కడ భద్రంగా ఉన్నాయి. 

బాలకృష్ణతో శివరాజ్ కుమార్ తో చాలా స్నేహం ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణిలో అడగ్గానే బుర్రకథ పాటలో నటించానికి ఒప్పుకుని పారితోషికం తీసుకోకుండా చేశారు. ఇప్పుడీ జైలర్ వల్ల ఆయన్ను దృష్టిలో పెట్టుకుని క్యామియోలు రాస్తున్న దర్శకులు ఉన్నారట. వీరసింహారెడ్డిలో బాలయ్య పంచె గెటప్ ని శివరాజ్ కుమార్ మఫ్టీలో నుంచి తీసుకునే స్ఫూర్తి చెందామని బాలయ్య ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్ని నిముషాలు కనిపించాం అన్నది కాదు ఆడియన్స్ కి ఎంతలా గుర్తుండిపోయామన్నది ముఖ్యమనే పోకిరి పండులా నరసింహ నిలిచిపోయేలా ఉన్నాడు. అన్నట్టు ఇంత చర్చ మోహన్ లాల్ గురించి జరగకపోవడం ఫైనల్ ట్విస్టు.

This post was last modified on August 12, 2023 4:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

1 minute ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

12 minutes ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

1 hour ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

1 hour ago

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

2 hours ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

2 hours ago