మెలోడీ బ్రహ్మగా మణిశర్మకున్న పేరు అంతా ఇంతా కాదు. 1998 నుంచి ఆయన సాగించిన హవా గురించి కథలుగా చెప్పొచ్చు. ఎన్నో మాస్ సినిమాలు పాటలు, బిజిఎం వల్ల నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయి ఇండస్ట్రీ హిట్లు సాధించాయి. ఇప్పటికీ యూట్యూబ్ టాప్ చార్ట్స్ లో బోలెడు ట్రాక్స్ భద్రంగా చోటు సంపాదించుకున్నాయి. అలాంటి లెగసికి వారసత్వమంటే దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా చెమట చిందించాలి. కానీ మహతి స్వర సాగర్ ఆ దిశగా కష్టపడుతున్నాడో లేదో తెలియదు కానీ ఛలో తర్వాత మళ్ళీ అంతకు మించిన ఆల్బమ్ ఇవ్వలేక ఆపసోపాలు పడుతున్న వైనం చూస్తున్నాం.
సరే జాక్ పాట్ లాగా భోళా శంకర్ ఆఫర్ వచ్చింది. సినిమాలో కంటెంట్ సంగతి తర్వాత కనీసం ఆల్బమ్ గొప్పగా ఇచ్చి ఉంటే వాటితో అయినా ఫ్యాన్స్ సంతృప్తి చెందేవారు. కానీ జరిగింది వేరు. చిరు ఎంత హుషారుగా డాన్స్ చేసినా, రొటీన్ గా అనిపించిన ట్యూన్స్ జనాలకు ఎక్కలేదు. ఫలితంగా ఒక్కటంటే ఒక్క పాట సరైన రీతిలో రిజిస్టర్ కాలేకపోయింది. కనీసం టైటిల్ సాంగ్ బాగున్నా ఏదోలే అనుకోవచ్చు. బ్యాడ్ లక్ అదవ్వలేదు. మణిశర్మ తొలిసారి బావగారు బాగున్నారాకు పని చేసినప్పుడు అదిరిపోయే పాటలు ఇచ్చారు. సారీ సారీ, అంటీ కూతురా ఇప్పటికీ హాట్ ఫేవరెట్స్.
మహతి అలా ఇచ్చి ఉంటే ఇతర స్టార్ హీరోలు పిలిచి ఆఫర్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఆ ఛాన్స్ చేతులారా వదిలేసుకున్నట్టు అయ్యింది. ఇళయరాజా వారసుడిగా యువన్ శంకర్ రాజా రెండు దశాబ్దాలుగా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నాడు. తెలుగులోనూ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కోటి తన తండ్రి సాలూరు రాజేశ్వరరావుగారి పేరుని నిలబెట్టారు. మహతి స్వరసాగర్ ది ఇంకా చిన్న వయసు.చాలా కెరీర్ ఉంది. కసితో పని చేయాలి. తమన్, దేవిలతో పోలిస్తే తాను ఎక్కడ వెనుకబడుతోంది గుర్తించాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మాట కోసం ఆఫర్లు ఇచ్చే స్టార్ హీరోలు దొరక్కపోవచ్చు.
This post was last modified on August 12, 2023 1:31 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…