..Hema అనే ఆర్టిస్ట్ అప్పుడప్పుడే చిన్న చిన్న వేషాలు వేస్తుంది. నేను కోడైరెక్టర్ గా పని చేసిన నేటి సిద్దార్ధ లో ఒక చిన్న పాత్ర చేయించాను.. తర్వాత క్షణక్షణం సినిమా కి రాము చూసి శ్రీదేవి ఫ్రెండ్ వేషానికి ఒకే చేశారు.. తర్వాత రమ్మని కాల్ చేస్తే ఆఫీసు కి వొచ్చింది. ఐదు రోజులు కావాలి హైదరాబాద్ లో షూటింగ్ అని చెప్పాను. ఏం వేషం సర్ అని అడిగింది. సెకండ్ హీరొయిన్ అని చెప్పాను. చాల ఖుషీగా వెళ్లిపోయింది.
షూటింగ్ ముందు రోజు హైదరాబాద్ వచ్చింది. రేపు నీకు షూటింగ్ వుంటుంది అని మేనేజర్ తో ప్రోగ్రామ్ చెప్పించాను.. మరుసటి రోజు షూటింగ్ కి వచ్చింది. ఒకే శీను. హేమ తో మాట్లాడాలి ఏదైనా ఎక్సప్లైన్ చేయాలన్నా రాము నన్ను కూడా రమ్మనే వాడు..సీన్ మొత్తం ఎక్సప్లైన్ చేస్తున్నప్పుడు హేమ చాలా భయపడేది..సార్ ఆయన్ని చూస్తుంటే నాకు భయమేస్తోంది..నన్నే ఒక మాదిరిగా చూస్తున్నారు అని నాతో చెప్పింది..నేను చెప్పాను..హేమా..ఆయన నిన్ను చూస్తున్నట్టు నీకు అనిపించినా తను చూసేది నిన్ను కాదు..ఒక పని చెయ్.. ఈసారి నీతో మాట్లాడుతున్నప్పుడు నీ సీటులోనుంచి లేచి పక్కన నిలబడు.. అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్పాను..
తర్వాత రాము ఎక్సప్లైన్ చేస్తుండగా తను సీట్లోనుంచి లేచి నిలబడింది..కానీ రాము ఆ సీటు వైపే చూస్తూ మాట్లాడాడు..అప్పుడు రియాలైజ్ అయిన హేమ..నాతో.. మీరు చెప్పింది నిజమే ఆయన చూస్తుంది నన్ను కాదు..అన్నది..అప్పుడు నేను చెప్పాను..హేమా..ఆయన మైండ్ లో అనేక ఆలోచనలు తిరుగుతుంటాయి..నీతో మాట్లాడుతూ కూడా ఆయన ఇంకోదాని గురించి ఆలోచిస్తుంటాడు అని..హేమ కంగారు పొగిట్టుకుని బాగా పెరఫామ్ చేసింది…సాయంత్రానికి అయిపోయింది.
హేమా ..నీ పాత్ర అయిపాయింది ..రేపు చార్మినార్కి వెళ్లి ఏదైనా షాపింగ్ చూసుకుని ఎల్లుండి ట్రైన్ కి నీ టిక్కెట్ రెడీ గా ఉంది..నువ్వు బయలుదేరవొచ్చు అని చెప్పాను. మరి నాకు సెకండ్ హీరోయిన్ అని చెప్పారు. అప్పుడే అయిపాయిందా అని అడిగింది ..సినిమా అయిపోయాక ప్రీవ్యూ వేసినప్పుడు పిలుస్తాను వచ్చి చూడు అని చెప్పాను. హేమ కి అర్ధం కాలేదు. అప్పుడు చెప్పాను. శ్రీదేవి కాకుండా ఈ సినిమా లో కనిపించే ఇంకో స్త్రీ పాత్ర నీదే ..కాబట్టి నువ్వు సెకండ్ హీరోయిన్ వి అని..మరి ఐదు రోజులు ఎందుకు తీసుకున్నారు అంటే..ఒకరోజు బయలు దేరడానికి..రెండో రోజు ట్రైన్ లేట్ అయినా మరే కారణంగా అయినా షూటింగ్ చేయలేక పోవచ్చు..మూడో రోజు షూటింగ్.. ఒకవేళ కొంచం ..వర్క్ బ్యాలన్స్ పడితే అది కూడా నెక్స్ట్ డే ఫినిష్ చేసి తర్వాతరోజు పంపించవచ్చు..ఇలా ప్లాన్ చేస్తాం అని చెప్పాను..
తర్వాత నా మనీ సినిమాలో ఒక వేషం వేసింది..ఇది కూడా సెకండ్ హీరోయిన్ వేషమేనా అని అడిగింది..కాదు థర్డ్ హీరోయిన్ అని చెప్పాను..మనీ లో జయసుధ..రేణుకా సహానీ కాకుండా మూడో క్యారక్టర్ పరీష్ రావేల్ గర్ల్ ఫ్రెండ్ ..అది హేమతో చేయించాను..కాబట్టి అది మూడో హీరోయిన్ క్రింద లెక్క అన్నమాట..తర్వాత హేమ చాలా సినిమాలలో చాలా మంచి మంచి వేషాలు చేసి బాగా పేరు తెచ్చుకుంది. ఇది..సెకండ్ హీరోయిన్ కధ..
— శివ నాగేశ్వర రావు
This post was last modified on August 18, 2020 4:46 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…