దక్షిణాది అతి పెద్ద మెగాస్టార్, సూపర్ స్టార్ సినిమాల్లో అవకాశం దక్కించుకోవడమంటే చిన్న విషయం కాదు. కీర్తి సురేష్ కి ఆ అదృష్టం దక్కింది. అయితే ఒకపక్క ఆనందపడుతూనే మరోపక్క దిగులు చెందేలా వాటి ఫలితాలు కలవరపెడుతున్నాయి. రజనీకాంత్ అన్నాతే (పెద్దన్న) ఎంత దారుణమైన డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంట్లో సెంటిమెంట్ సీన్లు బాగానే వచ్చినా దర్శకుడు సిరుతై శివ తీసుకున్న అవుట్ డేటెడ్ కథా కథనాలు జనం థియేటర్ నుంచి పారిపోయేలా చేశాయి. దీంతో తలైవర్ తో నటించిన అనుభవం కీర్తికి సురేష్ కి బ్యాడ్ మెమరీగా నిలిచిపోయింది.
తాజాగా భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలిగా మరోసారి అలాంటి పాత్రే దక్కింది. స్క్రీన్ మీదే కాదు బయట కూడా వీళ్ళ బాండింగ్ చాలా క్యూట్ గా ఉండటం ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రేక్షకులు చూశారు. కట్ చేస్తే ఇప్పుడదే రిజల్ట్ మళ్ళీ రిపీట్ అయ్యింది. కనీసం ఏవరేజ్ అనిపించుకున్నా కొంత ఊరట దక్కేది కానీ పెద్దన్నకు ఏ మాత్రం తీసిపోని రీతీలో భోళా తిరస్కారానికి గురైంది. దీంతో ఇద్దరికీ తక్కువ గ్యాప్ లో చెల్లెలుగా యాక్ట్ చేసినందుకు సంతోషపడాలో లేక జీవితాంతం గుర్తుండిపోయేలా ఫ్లాప్ అయినందుకు బాధ పడాలో తనకే అర్థం కాకపోవడం సహజం.
పెర్ఫార్మన్స్ పరంగా కీర్తి సురేష్ ఈ రెండు సినిమాల్లో బాగానే నటించింది. కానీ తనలో మహానటిని ఆవిష్కరించే కోణం కథలు డిమాండ్ చేయలేదు. అందుకే చెప్పుకోదగ్గ స్థాయిలో ఇవి రాలేదు. గతంలో రజని, చిరులతో ఇలా ఏక కాలంలో సోదరిగా నటించిన దాఖలాలు దాదాపుగా లేనట్టుగానే కనిపిస్తున్నాయి. ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ క్రితం కొందరు చేసి ఉండొచ్చు కానీ కేవలం రెండేళ్ల గ్యాప్ తో ఆ ఛాన్స్ కొట్టేసింది మాత్రం కీర్తి సురేష్. దెబ్బకు ఇకపై సీనియర్ హీరోలు ఎవరైనా తనను చెల్లిగా పెట్టి రిస్క్ చేయడం కంటే హీరోయిన్ గా తీసుకుంటేనే బెటరనుకుంటారేమో. సెంటిమెంట్ మహత్యం మరి.
This post was last modified on August 12, 2023 11:40 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…