నిన్న విడుదలైన భోళా శంకర్ ఫలితం ఎన్నో పరిణామాలకు దారి తీస్తోంది. రిజల్ట్ ఏమైంది, ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారనే వాస్తవాలు చిరంజీవి దాకా ఎవరైనా తీసుకెళ్తున్నారో లేదో కానీ అభిమానుల ఘోష మాత్రం ఓ రేంజ్ లో ఉంది. చుట్టూ భజన బృందాల మాటలు నమ్మేసి సినిమాలు చేయడం వల్ల నిర్మాతల నష్టాల సంగతి తర్వాత ముందు తమ బాధ చూడమని సోషల్ మీడియా వేదికపై రకరకాలుగా వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పుడిది నేరుగా నెక్స్ట్ మెగాస్టార్ తో చేయబోయే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మీద పడింది. ఈ నెలలోనే దీని ప్రకటన రానున్న సంగతి తెలిసింది.
ఇక్కడ సమస్య ఏంటంటే కళ్యాణ్ కృష్ణ సైతం భీభత్సమైన ఫామ్ లో లేడు. ఒక్క సోగ్గాడే చిన్ని నాయనతోనే బండి నెట్టుకొస్తున్నాడు. బంగార్రాజు కమర్షియల్ బాగానే ఆడింది కానీ అదేమీ మొదటి భాగమంత రేంజ్ కాదని నాగ్ ఫ్యాన్సే ఒప్పుకుంటారు. చైతుతో చేసిన రారండోయ్ వేడుక చూద్దాం హిట్టు స్టాంప్ తో బయటపడగా రవితేజ నేల టికెట్టు దారుణంగా బోల్తా కొట్టింది. ఇలాంటి ట్రాక్ రికార్డుతో కళ్యాణ్ కృష్ణకు మెగా ఆఫర్ వచ్చింది. ఇది కూడా ఒకప్పుడు చిరు ఇచ్చిన కమిట్ మెంట్లలో భాగంగా ఇప్పుడు తీరుస్తున్నదే తప్ప కొత్తగా కథ నచ్చో కాంబో కుదిరో చేస్తున్నది కాదు.
అసలే ఇది మలయాళం బ్రో డాడీ రీమేక్ అనే ప్రచారం విపరీతంగా ఉంది. ఇది మన ఆడియన్స్ కి ఎంత మాత్రం సూటవ్వని పాయింట్ తో ఉంటుంది. దాన్ని చిరు చేయడమంటే రిస్కే. కానీ ఇది పూర్తిగా వేరే సబ్జెక్టని, ప్రసన్న కుమార్ ఫ్రెష్ గా రాసిచ్చారని టీమ్ అంటోంది. నిజాలు తేలాలంటే కొంత టైం పడుతుంది. ఈలోగా స్క్రిప్ట్ ని మరోసారి పూర్తిగా వడబోసి చెక్ చేసుకోవడం చాలా అవసరం. కేవలం చిరు ఇమేజ్ ని నమ్ముకుని ఏది బడితే అది రాసుకుంటే ఏం జరుగుతోందో మెహర్ రమేష్ చూపించేశాడు. అందుకే కళ్యాణ్ కృష్ణ మీద ఆల్రెడీ ఉన్నబీ బరువు కాస్తా బండెడుగా మారిపోయింది.
This post was last modified on August 12, 2023 10:38 am
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…